Chandrababu Naidu wish Jagan on his birth Day

Chandrababu naidu wish jagan on his birth day

Jagan, Chandrabababu, YS Jagan Birth Day, Call Money, Yanamala Ramakrishnudu

AP CM Chandrababu naidu wish YS Jaganmohan Reddy on his birth Day. In Assembly Chandrababu, Ministers, MLAs and Speaker wish jagan.

విష్ చేసిన చంద్రబాబు.. వాకౌట్ చేసిన జగన్

Posted: 12/21/2015 10:05 AM IST
Chandrababu naidu wish jagan on his birth day

ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హాజరైన జగన్ ను మంత్రులు, ఎమ్మెల్యేలు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలిపారు. కాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతూనే.. సమావేశాల్లో జగన్ తీరుపై సునిశితంగా విమర్శించారు. రోజా సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్రతిపక్ష నాయకులు చేసిన డిమాండ్ మీద యనమల క్లారిటీ ఇచ్చారు. రోజా మీద వేటు మీద ఎలాంటి మార్పు ఉండబోదని వెల్లడించారు.

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నుంచి ప్రతిపక్షం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై చర్చ కొనసాగించకపోవడం, రోజా పై సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ జగన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సమావేశాలను వైసిపి బాయ్ కాట్ చేసింది. అధికార పక్షం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల ప్రారంభంలోనే జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. మీ అందరికి కూడా సెలవు, ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు అంటూ జగన్ బటయకు వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేత సభలో ఉండాల్సి అంటూ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆయనను వారించే ప్రయత్నం చేసినా జగన్ వినిపించుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Chandrabababu  YS Jagan Birth Day  Call Money  Yanamala Ramakrishnudu  

Other Articles