actor-orlando-bloom-harassed-by-immigration-officials-at-delhi-airport

British actor orlando bloom deported from new delhi

Orlando Bloom Orlando Bloom deported Orlando Bloom Taj Mahal Samajwadi Party Amar Singh, hollywood actor, orlando, delhi airport, immigration, orlando bloom deported from delhi, orlando bloom deported, orlando bloom news, orlando bloom in india, orlando bloom latest news, entertainment news

actor-orlando-bloom-harassed-by-immigration-officials-at-delhi-airport

అమ్మె అధికారులు.. ఆ నటుడికి కూడా చుక్కలు చూపారు..!

Posted: 12/21/2015 02:44 PM IST
British actor orlando bloom deported from new delhi

హాలీవుడ్ హీరో ఒర్లాండో బ్లూమ్ బిక్కముఖం వేశాడు. తనను అతిధిగా ఆహ్వానించడంతో ఎగురేసుకుని వచ్చిన ఒర్లాండో తన ఈ వీసా స్టేటస్ ను కూడా పరిశీలించకుండా ఇండియాకు వచ్చి. అక్కడ భారత అధికారుల ముందు తెల్లముఖం వేశాడు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనకు చుక్కలు చూపించారు. సరైన వీసా లేకుండా వచ్చిన ఈ బ్రిటీష్ యాక్టర్ను తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కించారు. దీంతో బ్లూమ్ 24 గంటల వ్యవధిలో లండన్, ఢిల్లీల మధ్య రెండు సార్లు ప్రయాణించాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆయనకు ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొనడానికి ఆహ్వానం వెల్లింది. దీంతో ఒర్లాండో తాను దాఖలు చేసుకున్న ఈ విసా స్టేటస్ రిజెక్ట్ అయిన విషయాన్ని చూసుకోకుండానే ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఢిల్లీ ఇమ్మిగ్రేషన్ అదికారులు అతన్ని వెనువెంటనే తిప్పి లండన్ కు పంపిచారు. విదేశీయులు దేశంలోకి వీసా లేకుండా వచ్చినా.. వారి అగమనంతోనే వీసాలు కల్పిస్తామని ప్రధాని చెప్పిన మాటలను కూడా లక్ష్యపెట్టని అధికారులు.. బ్లూమ్ కు చేధు అనుభవాన్ని మిగిల్చారు.

చివరికి ఈ వ్యవహారంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి వెళ్లడంతో.. ఆమె జోక్యం చేసుకొని ఒర్లాండోకు తాత్కాలిక వీసాను మంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో బ్లూమ్ 24 గంటల వ్యవధిలో రెండు పర్యాయాలు ఢిల్లీ, లండన్ ల మద్య ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గోన్నారు. కాగా, ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికి ఉద్దేశపూర్వకంగానే బ్లూమ్ను ఇబ్బంది పెట్టినట్లు ఇమిగ్రేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : actor  orlando  delhi airport  immigration  

Other Articles