బాల నేరస్తుల చట్టాల్లో మార్పులు తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం తమను ఇరకాటంలో పడేస్తుందని దేశ అ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు (ప్రస్తుతం 20 ఏళ్లు) అని.. సదరు దోషిని విడుదల చేయకుండా జైలులోనే ఉంచేలా చూడాలన్న ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటిషన్ ను ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. అవేంటంటే..
* మీరు అభ్యర్థించినట్లుగా ఏ చట్టం ప్రకారం మేం ఇంకా అతడిని అదుపులో ఉంచుకోగలం* ఏదైనా జరిగిందంటే అది చట్టానికి లోబడే, చట్ట ప్రకారమే జరిగింది. మేం చట్టానికి అతీతులం కాదు
* రాజ్యాంగంలోని 21 నిబంధన ప్రకారం ఒక వ్యక్తి హక్కును మేం హరించలేము. చట్టంలో అలాంటి అవకాశం పొందుపరచలేదు.
* మేం మీ ఆందోళనను అర్ధం చేసుకోగలం.. కానీ, ఈ కేసులో చట్టం మూడేళ్లకు మించి బాల నేరస్తుడిని అదుపులో ఉంచుకునేందుకు అనుమతించదు
* ఒక వేళ ప్రభుత్వం ఆ మేరకు చట్టంలో మార్పులు చేసే క్రమంలో ఏడు నుంచి పదేళ్ల సమయం పడితే అప్పటి వరకు అతడిని అదుపులో ఉంచుకోగలమా? ఆ విధంగా చేసేందుకు మాకు చట్ట అనుమతి ఏది? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more