Tdp parliamentarian jc diwakar reddy comments on party chief

Diwakar reddy hot comments on cm chandrbabu

jc diwakar reddy, chandrababu, stubborn ness, jc prabhakar reddy, TDP, Congress, call money, sex racket, Tdp parliamentarian jc diwakar reddy, Tdp parliament member jc diwakar reddy, mp jc diwakar reddy hot comments, jc hot comments on chandrababu,

Tdp parliament member jc diwakar reddy hot comments on Andhra Pradesh chief minister and party chief chandrababu naidu

ఏం చెప్తిరి... ఏం చెప్తిరి టీడీపీ ఎంపీ దివాకర్ గారూ..

Posted: 12/21/2015 08:30 PM IST
Diwakar reddy hot comments on cm chandrbabu

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన అపార రాజకీయ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని వినియోగించి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మెత్తటి స్వభావాన్ని అవలంభిస్తున్నారన్నారని... అలా కాకుండా పూర్వం మాదిరిగానే బాబు కఠన వైఖరి అవలంభించాల్సిన అవసరం ఎంతైన ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యాలు చేయడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తాను తన రాజకీయ జీవితంలో ఎప్పుడు మారలేదని పదే పదే చెబుతుండగా, జేసీ మాత్రం మారారని అనడం పట్ల పలవురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

1995లో విద్యుత్ బిల్లుల పెంపును వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన ర్యాలీలో.. మావోయిస్టులు వున్నారని, వారు అసెంబ్లీని ముట్టడించేందుకు వస్తున్నారని అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా బషీర్ బాగ్ కాల్పులు జరిపించిన చంద్రబాబు.. కావాలని జేసీ అడుడుతున్నారా..? లేక అలానే కఠినంగా వుండాలని అడుగుతున్నారా..? అర్ధం కావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా రెండు రోజుల క్రితం అదే వామపక్ష పార్టీల ఆద్వర్యంలో అంగన్ వాడీ మహిళలు చేస్తున్న అందోళన కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వం రక్తతర్పణం సృష్టించిన విషయం జేసీకి కనబడలేదా..? అని విమర్శలు వినబడుతున్నాయి.

అయితే తన ఒంట్లో ఇప్పటికి కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందన్న విషయాన్ని జేసీ అంగీకరించడం మాత్రం సబబేనని, ఈ విషయంలో ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు ఒంట్లోనూ కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుందని విపక్ష నేతలు విమర్శలు సంధిస్తున్నారు. చంద్రబాబు సమర్ధమైన నాయకుడు కాబట్టే తాను టీడీపీ లో చేరానని జగన్ చెప్పడంలోనూ తప్పులేదన్నారు. నవ్యా:ద్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. గోదావరి పుష్కరాలలో మృత్యుఘంటికలు మ్రోగినా.. రిషితేశ్వరి కేసులో అసులు నిందితులు స్వేచ్చావాయువును పీల్చినా.. ఓటుకు నోటు కేసులో, మద్యం మరణాల ఘటనలో, ఇసుక మాఫియా, బాక్సైట్ తవ్వకాల అంశాలలో తాజాగా కాల్ మనీ, సెక్సు రాకెట్ వ్యవహారంలో కూడా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పిన నాయకుడు సమర్థుడు కాక ఎమవుతాడని విమర్శలు వినబడుతున్నాయి.

సెక్స్ రాకెట్ సంబంధించి ఎవరవద్దనైనా అధారాలుంటే.. తనకు అందజేయాలని చెప్పిన చంద్రబాబు.. ఈ అంశంలో విపక్ష వైఎస్ఆర్ సిపి పార్టీనే అసెంబ్లీ సాక్షిగా తూర్పారబట్టిన బాబు.. భాధితులు ముందుకొచ్చి అధారాలిస్తే.. ఏం చేస్తారో కూడా అర్థమయ్యిందని.. ఎంతటి సమర్థవంతంగా వ్యవహరిస్తారో కూడా తేటతెల్లమయ్యిందన్న విమర్శలు షికార్లు చేస్తున్నాయి. వైసీపీ నేతలు చేసే చిన్న తప్పులను పెద్దదిగా చూపి.. తమ వాళ్లు చేసే పెద్ద తప్పులను చిన్నవిగా పరిగణించడంలో చంద్రబాబు సమర్థుడు కాక మరేమవతుతాడని వారు ప్రశ్నిస్తున్నారు.

జగన్ పుట్టక ముందే నుంచే కాల్ మనీ ఉందని ఎద్దేవా చేసిన ఎంపీ.. అప్పటి నుంచే మహిళలను, యువతులపై అత్యాచారాలకు పాల్పడి.. అ వీడియోలను అడ్డుపెట్టుకుని బలవంతంగా వ్యభిచార రోంపిలోకి దింపేవారా..? ఇంత దారుణమైన నేరాలకు పాల్పడిన వారిని వదిలేసి.. దానిని కేవలం కాల్ మనీ.. అధిక వడ్డీ కేసుగా పరిగణించడంలో చంద్రబాబు ప్రభుత్వ సమర్థతపై జేసీకి పూర్తి నమ్మకం వుండటంలో తప్పులేదని పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక మరికోందరు మాత్రం ఇంతటి చర్చనీయాంశమైన కేసులనే తమ ప్రభుత్వం చాకచక్యంగా సైడ్ ట్రాక్ చేయగలిగిందని, అయితే తనకు లాభం చేకూర్చే పనిలో కూడా ప్రభుత్వం ఎన్ని అటుపోట్లనైనా భరిస్తుందన్న ధీమా జేసీకి వుందంటున్నారు. ఇంకోందరు మాత్రం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనా.. జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి రావడం ఏంటని, ఆయన ఇంకా మాజీ మంత్రి అనుకుంటున్నారా..? లేక అధికార పార్టీ ఎమ్మెల్యే అనుకుంటున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jc diwakar reddy  chandrababu  stubborn ness  TDP  Congress  call money  sex racket  

Other Articles