నగరంలో కొత్త సంవత్సరం వేడుకలను డిసెంబరు 31వ తేదీ రాత్రి 8గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ 25 స్టార్ హోటల్స్, 3 పబ్‌లు, 22 రిసోర్టులు, 269 ఫాంహౌస్‌లు ఉన్నాయన్నారు. వీరందరూ ఈ నిబంధనలను పాటించాలన్నారు.
* ఆహ్వానం ఉన్న అతిథులను మాత్రమే లోపలికి అనుమతించాలి. జంటలను మాత్రమే అనుమతించాలి.
* పోలీస్ కమిషనర్ అనుమతిలేకుండా నూతన సంవత్సర వేడుకల పోస్టర్లు, హోర్డింగ్‌లను బహిరంగ ప్రదేశాల్లో డిస్ప్లే చేయకూడదు. అతిక్రమిస్తే ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 నమోదు చేస్తారు.
* డీజేలకు అనుమతి లేదు. లౌడ్ స్పీకర్ల శబ్దం 45 డీసీబిల్స్కి మించరాదు. ఆర్గనైజర్స్ ఎస్‌హెచ్‌వో/ఏసీపీ ప్రత్యేక అనుమతితోనే డీజే వాడాలి. అశ్లీల నృత్యాలు, నటనలు, సినిమా ప్రదర్శన నిషేధం.
* ఈవెంట్ ప్రచారం కోసం నగ్న చిత్రాలు, అర్ధనగ్న చిత్రాలతో పత్రికల్లో ప్రకటలు ఇవ్వడం, టీవీ ప్రకటనలు ఇవ్వడం నివేధం.
* మద్యం సేవించిన వారిని, అనుచితంగా ప్రవర్తించేవారిని లోపలికి అనుమతించకూడదు.
* ప్రదర్శనలు ప్రమాదకరంగా ఉండకూడదు. మారణాయుధాలతో తిరగరాదు.
* డివిజన్ ఫైర్ ఆఫీసర్/రీజనల్ ఫైర్ ఆఫీసర్ సూచనలను పాటించాలి.
* అతిథిలందరికి ఈ నిబంధలను ముందుగానే చెప్పాలి.
* పోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచి పూరైంత వరకు ఆహూతులతో సహా రికార్డు చేసి పోగ్రాం సిడీలను రెండు రోజులలోపు తనిఖీ కోసం సైబరాబాద్ కమిషరేట్‌లో సమర్పించాలి.
* నగరంతోపాటు ఓఆర్ఆర్పై డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ తనిఖీలకు ప్రత్యేక పోలీసుల బృందాలుంటాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
* వేదిక లోపలి ప్రాంగణంలో వాహనాలను పార్క్ చేయాలి. రోడ్డు మీద పార్క్ చేయడానికి అనుమతించరు.
* సాధారణ ప్రజలు 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్పై అనుమతి లేదు. శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేవారిని, వచ్చే వారిని, ఇతర ప్రముఖలను అనుమతిస్తారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more