Its very shame to Modi and his govt

Its very shame to modi and his govt

Modi, pathankot, Punjab, Lieutenant Colonel Niranjan EK, martyr Mool Raj, Gursewak Singh

Pathankot martyr Lieutenant Colonel Niranjan EK was cremated with full military honours at his native place Palakkad in Kerala on Tuesday. One more martyr, Garud Commando Corporal Gursewak Singh was cremated at his village Garnala near Ambala in Haryana on Monday. The only earning hand in the family and another martyr Mool Raj was cremated at his native place Jakh village in Samba district of Jammu and Kashmir on Monday.

అమర వీరుల అంత్యక్రియలకు హాజరు కాలేదు.. సిగ్గు సిగ్గు

Posted: 01/06/2016 07:47 PM IST
Its very shame to modi and his govt

అంత్యక్రియలకు... దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల అంత్యక్రియలకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా హాజరుకాకపోవడం.. మోదీ సర్కార్ మీద తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పంజాబ్ లోని పటాన్ కోట్ లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారిని అడ్డుకోవడంలో భాగంగా... భరతమాత ముద్దు బిడ్డలుగా తమ ప్రాణాలను సైతం అర్పించిన సైనిక వీరుల అంత్యక్రియలకు మోదీ గానీ... ఆయన కేబినెట్ లోని ఒక్క మంత్రి గారు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. పటాన్ కోట్ దాడిలో ఏడుగురు సైనికులు తమ ప్రాణాలను కోల్పోగా.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా హాజరుకాకపోవడం గమనార్హం.

పటాన్ కోట్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన లెఫ్టెనెంట్ కల్నల్ ఈకె నిరంజన్ అంతిమ యాత్ర కేరళలోని పాలక్కడ్ లో జరిగింది. అయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, అతడితో పాటు కొంత మంది సహచర మంత్రులు కూడా హాజరయ్యారు. కాగా స్థానిక బిజెపి నాయకులు, ప్రతిపక్షపార్టీ నాయకులు కూడా ఈ యాత్రలో పాలుపంచుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా హాజరుకాకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని మీద కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. మోదీ అంత్యక్రియలకు రావాల్సిందని.. కనీసం తన తరఫున కేంద్ర మంత్రులనైనా పంపించాల్సిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

కల్నల్ నిరంజన్ అంత్యక్రియల్లో కనిపించిన సీనే మిగిలిన సైనిక వీరుల అంత్యక్రియల్లో కనిపించింది. మూల్ రాజ్ అనే మరో సైనికుడి అంత్యక్రియలు జమ్ము సాంబా జిల్లా జక్ గ్రామంలో జరిగాయి. అలాగే గురుసేవక్ సింగ్ అనే సైనికుడి అంత్యక్రియలు అంబాలా దగ్గరలోని గార్నాలా గ్రామం, హర్యానాలో జరిగింది. కాగా ఇలా ఏ ఒక్క సైనిక వీరుడి అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా హాజరుకాలేదు. అయితే అదే గతంలో 26/11 దాడిలో మాత్రం మోదీ నాటి యుపిఎ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సైనిక వీరులకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో దీన్ని కూడా యుపిఎ మీద విమర్శలు గుప్పించడానికి ఆయన వాడుకున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి అప్పుడు యుపిఎ మీద అంతలా విమర్శించిన ఆయనే నేడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఆయన స్వయంగా ఎందుకు హాజరుకాలేదు అన్నది ప్రశ్న. సరే తాను స్వయంగా హాజరుకాలేకపోయినా కనీసం తన ప్రతినిధులుగా కేంద్ర మంత్రులను పంపించాల్సి ఉండాల్సింది అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ మారిపోయారని మాజీ సైనికులు సైతం విమర్శిస్తున్నారు. మోదీ అధికారంలోకి వస్తే తాను పాకిస్థాన్ కు ఎలా సమాధానం చెబుతానో అంటూ స్పీచులిచ్చిన మోదీ ఇప్పుడు మాత్రం పాకిస్థాన్ తో స్నేహం కోసం ఆరాటపడుతున్నారని అంటున్నారు. సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చెయ్యడంలో విఫలమయ్యారని.. నేడు అదే మోదీ సైనికులను కూడా అవమానించారని.. ఆయన అందరిని మోసం చేస్తున్నారని ఓ మాజీ సైనికాధకారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Modi  pathankot  Punjab  Lieutenant Colonel Niranjan EK  martyr Mool Raj  Gursewak Singh  

Other Articles