MP Kavitha slams Pawan Kalyan

Mp kavitha slams pawan kalyan

Kavitha, MP Kavitha, Pawan kalyan, GHMC, GHMC Elections, GHMC polls

MP kavitha Slams pawan Kalyan on his campaign gossip. She said that on elections every one will come with makeup after the elections they will packup.

మేకప్ చేసి తర్వాత పేకప్ చెప్పే వాళ్లే: ఎంపీ కవిత

Posted: 01/09/2016 06:22 PM IST
Mp kavitha slams pawan kalyan

ఎన్నికలప్పుడే కొంత మంది గంగిరెద్దుల్లా తలలూపుకుంటు వస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి, బిజెపి పార్టీలు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించనున్న దాని మీద ఆమె ఇలా స్పందించారు. ఎన్నికలప్పుడు మేకప్ చేసుకుని ఆ తర్వాత అందరు పేకప్ చెప్పే వారేనని కవిత వ్యాఖ్యానించారు. తిక్క పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని తెలిపారు. ఆంధ్రోళ్లు ఎక్కువగా ఉన్నారని ఆంధ్రోళ్లతో హైదరాబాదులో ప్రచారం చేయించిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కవిత అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ హైదరాబాద్‌కు ఏదో చేస్తాడని బీజేపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎంతో మంది ఆంధ్రా వారు లబ్ధిపొందారని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha  MP Kavitha  Pawan kalyan  GHMC  GHMC Elections  GHMC polls  

Other Articles