nagarjuna requests minister ktr on killing piracy

Ktr open ups on his favourite hero in tv live show

tollywood, tollywood hero, hero nagarjuna, phone call, live show, sakshi tv live show, sakshi tv fourth estate, minister ktr, favaurite hero, KTR favaurite hero, ktr favaurite hero nagarjuna, favourite hero, tollywood, piracy

tollywood hero nagarjuna requests telangana minister KTR on killing piracy in a TV live show, where ktr open ups on his favaurite hero

లైవ్ షోలో అభిమాన హీరో పేరును భయటపెట్టిన కేటీఆర్

Posted: 01/13/2016 05:12 PM IST
Ktr open ups on his favourite hero in tv live show

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కె.తారక రామారావు అనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటారా..? తాను పాల్టొన్న ఓ టీవీ చానల్ లైవ్ షోలో సాధారణ ప్రజ మాదిరిగా ఓ ప్రముఖ వ్యక్తి, అందులోనూ తెలుగు సినిమా హీరో.. మరీ ముఖ్యంగా తన అభిమాన హీరో ఫోన్ చేయడమే ఇందుకు కారణం. గ్రేటర్ ప్రజల అభిప్రాయాలకు సమాధానాలు ఇస్తూ.. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరిస్తూ.. ప్రభుత్వం దృష్టికి రాని సమస్యలను నమోదు చేసుకుంటూ.. వాటిని పరిష్కారానికి ఏం చేయబోతారన్నది కూడా వివరించేందుకు సాక్షి టీవీ నిర్వహించిన ఫోర్త్ ఎస్టేట్ అనే కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆయన సమాధానాలు ఇస్తుండగా, అయన అభిమాన హీరో ఫోన్ చేశారు. ఎవరాయన అంటారా.. సోగ్గాడే చిన్నినాయన' చిత్రం ద్వారా ఎల్లుండి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాగార్జునే.  లైవ్ ద్వారా మాట్లాడిన నాగార్జున అమాత్యుల ముందు తన కోరికను ఉంచారు. ఈ సంక్రాంతి సీజన్ లో పలు తెలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయని, అవి పైరసీని బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని., పైరసీకి అడ్డుకట్ట వేయడంతో అటు చిత్రపరిశ్రమతో పాటు ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని చెప్పారు. అరికట్టాలని విన్నవించారు.

నాగార్జున వినతిని వినమ్రంగా అలకించిన కేటీఆర్.. చిరునవ్వులు పూయిస్తూ అందుకు సరేనన్నారు. తన అభిమాన నటుడు తన లైవ్ షోలోకి వచ్చి కోరికను కోరడంతో ఉబ్బితబ్బియిన కేటీఆర్.. తన ఆనందాన్ని అణుచుకుని చివరకు అసలు విషయాన్ని బయటపెట్టారు. తాను నాగార్జునకు గొప్ప అభిమానని చెప్పారు. 'శివ' చిత్రం నుంచి తాను నాగ్ వీరాభిమానిగా మారిపోయానని గుర్తు చేసుకున్నారు. పైరసీని అరికట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తరపున తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minister ktr  nagarjuna  favourite hero  tollywood  piracy  

Other Articles