Oops...Wrong patient's breast removed at Tokyo hospital

Public hospital in chiba removes patient s breast by mistake

Wrong patient's breast removed Tokyo hospital, medical malpractice, Japan, chiba hospital, tokyo hospital, breast cancer, Chiba Cancer Center, deep apologies, Public hospital, Chiba, japan, patient's breast, mistake

The Chiba Cancer Centre mixed up test samples resulting in a 30-year-woman being told she had advanced breast cancer.

పోరబాటున యువతి వక్షోజం తొలగింపు.. ఆనక పరిహారం చెల్లింపు

Posted: 01/13/2016 05:20 PM IST
Public hospital in chiba removes patient s breast by mistake

సాధారణంగా రిపోర్టులు మారిపోయి ఒకరికి చేయాల్సిన ఆపరేషన్‌ వేరొకరికి చేస్తుండడం మనం సినిమాల్లోని రీల్ లైప్ లలో అధికంగా చూస్తుంటాం. కానీ రియల్‌ లైఫ్‌లో కూడా అలాంటి పొరపాట్లు జరుగుతాయని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌ నిరూపించింది. రిపోర్టులు మారిపోవడంతో అక్కడి వైద్యులు ఏకంగా వేరొక మహిళ వక్షోజాన్ని కత్తిరించారు. ఆనక నిజం తెలిసి తప్పును సరిదిద్దుకునే పనిలో భాగంగా భారీ నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధమవుతున్నారు.
 
టోక్యోలోని చిబా కెన్సర్‌ సెంటర్‌లో జరిగింది ఈ ఘటన. గత నెలలో ఇద్దరు మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనుమానంతో ఈ హాస్పిటల్‌కు చెకింగ్‌ కోసం వచ్చారు. వారిలో 30 ఏళ్ల లిండ్సేకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ లేదని, 50 ఏళ్ల మహిళకు ఉందని తేలింది. అయితే రిపోర్టులు ఇచ్చేటపుడు మాత్రం ఇరువురిదీ పొరపాటుగా మార్చి ఇచ్చేశారు. దాంతో రిపోర్టుల ప్రకారం లిండ్సేకు త్వరగా ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పారు. దాంతో ఆమె గత శుక్రవారం ఆపరేషన్‌ చేయించుకోవడానికి వచ్చింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేసి కుడివైపు వక్షోజాన్ని తొలగించారు.

కాగా, రిపోర్టులు మారిపోయినట్టు గ్రహించిన 50 ఏళ్ల మహిళ ఆ విషయాన్ని సదరు వైద్యులకు తెలియజేసింది. దాంతో నాలిక కరుచుకున్న ఆస్పత్రి సిబ్బంది లిండ్సేకు అసలు విషయాన్ని చెప్పారు. ఆమె కోరుకుంటే కృత్రిమంగా వక్షోజాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అయితే లిండ్సే మాత్రం కోర్టుకు వెళ్లి నష్టపరిహారం గురించి కేసు వేయాలని భావిస్తోంది. క్యాన్సర్‌ ఉందని తెలిసినప్పటికీ బ్రెస్ట్‌ను తీయించు కోవడానికి తాను ఇష్టపడలేదని, కుటుంబ సభ్యుల బలవంతం వల్ల మాత్రమే ఆపరేషన్‌కు ఒప్పుకున్నానని చెప్పింది. అలాంటిది క్యాన్సర్‌ లేకుండా బ్రెస్ట్‌ తీసేసిన సదరు హాస్పిటల్‌ను కోర్టుకు ఈడుస్తానని పేర్కొంది. అస్పత్రివర్గాలు మాత్రం యువతికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్దంగా వున్నట్లు చెప్పాయి. చేతులు కాలక ఎన్ని ఆకులు పట్టుకుంటే మాత్రం ఎం లాభం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Public hospital  Chiba  japan  patient's breast  mistake  

Other Articles