శీర్షిక చూడగానే మీ మదిని అనేక సందేభహాలు తొలుస్తుంటాయని మాకు తెలుసు. నిజమే నేరప్రవృత్తి గలవారిని సన్మార్గంలోకి నడిపించేలా మార్పు తీసుకురావాల్సిన జైళ్లు.. నేరగాళ్లకు స్వర్గధామాలుగా మారుతున్నాయన్న విమర్శలను నిజం చేస్తున్నాయి. ఇక అక్కడి సిబ్బంది నేరగాళ్లలో మార్పులను తీసుకువచ్చేందుకు బదులు.. వారే మారిపోతూ లంచావతారాలు ఎత్తుతున్నారు. ఎందుకంటే జైలులో ఊచలు లెక్కబెడుతున్నా ఖైదీలకు సెల్ఫోన్లు, మాదక ద్రవ్యాలు, విలాస వస్తువులు అందడం షరామామూలుగా మారుతున్నాయి.
ఇక ..జైలు అధికారుల దీవెనలు మెండుగా వుంటే.. సతితో సంబోగం.. దాంపత్య జీవితానికి అడ్డు అదుపు కూడా వుండవని ఈ ఘటన రుజువు చేస్తుంది. ఖైదీలతో జైలు సిబ్బంది కుమ్మక్కై.. చిన్న చిన్న సేవలు అందించడం సాధారణంగా జరుగుతుండగా, బిహార్ జైలు సిబ్బంది మరో అడుగు ముందుకువేసి ఔరా..! అనిపించారు. జైలు గదిలోనే ఓ గ్యాంగ్‌స్టర్, అతని భార్య అయిన అండర్ ట్రయల్ ఖైదీ సంసారం చేసుకోవడానికి వీలు కల్పించినట్టు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
బిహార్‌లోని షివోహర్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ పూజకుమారి గర్భం దాల్చిన వ్యవహారంపై దర్యాప్తు జరుపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న తన భర్త, గ్యాంగ్‌స్టర్ ముఖేశ్ పాఠక్‌ను ఆమె తరచూ జైలులోని అసిస్టెంట్ జైలర్ కార్యాలయంలో కలిసేదని, ఇద్దరు కాపురం చేసిన ఫలితంగా ఆమె గర్భం దాల్చిందని వెలుగుచూడటం విస్మయపరుస్తోంది. గత ఏడాది ఈ భార్యాభర్తలు ఇద్దరూ వేర్వురు కేసుల్లో షివోహర్ జైల్లో ఖైదీలుగా ఉన్నారు.
ఆ సమయంలో వీరు వేరువేరు గదుల్లో దూరంగా ఉన్నా.. జైలు సిబ్బందికి తాయిలాలు ముట్టజెప్పి.. అసిస్టెంట్ జైలర్ కార్యాలయంలో తరచూ కలుసుకొనేవారని తాజా దర్యాప్తులో తేలింది. షివోహర్ జిల్లా మేజిస్ట్రేట్, ముజఫర్‌పుర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఈ దర్యాప్తు నిర్వహించారు. ఉత్తర బిహార్‌లో బలమైన నేరగాడైన సంతోష్ షా గ్యాంగ్‌లో షార్ప్‌షూటర్ అయిన ముఖేశ్ పాఠక్ దర్భాంగ ఇంజినీర్ల హత్యకేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. జైలు నుంచి పరారైన అతడు ప్రస్తుతం నేపాల్‌లో తలదాచుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more