Golden baba who wears 15 kg gold at Ardh Kumbh

Golden baba who wears 15 kg gold at ardh kumbh

golden baba, Golden Baba in Haridwar, Golden baba with 15 kg gold, Golden baba with 3 crore worth Jewellery

Even though the opening snan of the Ardh Kumbh didn't see a bevy of sadhus like the Nagas or those from the Juna akhara who add glitz and exoticism to the festival, the Ardh Kumbh till now has seen a few unique characters like the Golden baba, a sadhu who came with his followers decked in golden ornaments, to take a dip in the Ganga on Friday. The baba, believe it or not, according to his chelas, walks around wearing 15.5 kg of gold worth almost Rs 3 crore on his person!

ITEMVIDEOS: బాబా ఒంటి మీద 15 కేజీల బంగారం

Posted: 01/18/2016 01:51 PM IST
Golden baba who wears 15 kg gold at ardh kumbh

నీ ఇళ్లు బంగారం కాను అంటూ అప్పుడెప్పుడో పాత పాట ఒకటి గుర్తుందా.? అదే తరహాలో ఒకాయన ఒళ్లంతా బంగారం ఉంది. ఎవరైనా అతన్ని చూస్తే నీ ఒళ్లు బంగారం కాను అని అనకమానరు. ఇంతకీ ఎవరు ఆయన...?బంగారం ఎక్కడిది..? అనుకుంటున్నారా..? అయితే హరిద్వార్ లో జరుగుతున్న అర్ద్ కుంభమేళాకు వెళ్లాల్సిందే. హరిద్వార్ లో జరుగుతున్న అర్ద్ కుంభమేళాలో దేశం నలుమూలల నుండి ఎంతో మంది సాధు సంతులు వస్తున్నారు. అయితే అక్కడికి వచ్చిన ఓ సాధువును చూసి అందరూ అయ్య బాబోయ్. సాధు ఒంటి మీద ఇంత బంగారమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కేజీల బంగారం వేసుకొని.. బంగారు దుకాణమే నడుస్తున్నట్లు కనిపించిన గోల్డెన్ బాబా గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

సాధువులు, సంతులు అంటే బయటి ప్రపంచం మీద ఎలాంటి వ్యామోహం లేని వాళ్లు. దేని మీద ఆశగానీ, ఎలాంటి కోరికలు కానీ లేని వాళ్లు అని అందరికి తెలుసు. అయితే బాబాలందూ కొంత మందిబాబాలు వేరు అన్నట్లు. కొంత మంది మాత్రం తమ కోరికలను, తమ ఫ్యాషన్ ను చూపిస్తుంటారు. అలాగే హరిద్వార్ లో కనిపించిన గోల్డెన్ బాబా దాదాపు 15 కేజీల బంగారాన్ని అంటే దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ఒంటి మీద ధరించి గంగా నదిలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. రకరకాల నగలు, అన్ని వేళ్లకు బంగారు ఉంగరాలు, లాకెట్లు, చేతులకు కంకణాలు, అన్నింటి్కి మించి 27 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు గడియారం చూసి భక్తులందరూ షాక్ కు గురయ్యారు. ఒకప్పుడు ఈ గోల్డెన్ బాబా ఓ బట్టల వ్యాపారి. దిల్లీలో సుధీర్ కుమార్ మక్కడ్ గా తన బట్టల వ్యాపారాన్ని కొనసాగించే వాళ్లు. కానీ తర్వాత సన్యాసం స్వీకరించిన తర్వాత ఈయన ఇలా గోల్డెన్ బాబాగా అవతారమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles