హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనను దళిత, దళిత వ్యతిరేక ఘటనగా చిత్రీకరించవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రోహిత్ ఆత్మహత్య తరువాత ఐదు రోజులకు స్పందించిన అమె ఈ ఘటనపై వివరణ ఇస్తూ రోహిత్ మృతి విచారకరమంటూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ అంశంలో కొంతమంది వాస్తవాలు వక్రీకరించి రెచ్చగొడుతున్నారని స్మృతి వ్యాఖ్యానించారు. రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందన్నారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్సీయూ ఘటనలో కేంద్రం జోక్యం లేదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.
కాగా, రోహిత్ సూసైడ్ నోట్లో ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని అమె తెలిపారు. సూసైడ్ నోట్లో ఎవరి పేర్లు ప్రస్తావించలేదన్నారు. పీహెచ్డీ విద్యార్థుల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు కూడా నిరాకరించిన విషయాన్ని స్మృతి ఇరానీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల సస్పెన్షన్ కు సంబంధించి పాలకమండలి ఎప్పటికప్పుడు దళిత ప్రొఫెసర్లకు సమాచారం అందించిందని ఆమె తెలిపారు. విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పింది దళిత వార్డెనే అని స్మృతి చెప్పారు. అలాగే పాలకమండలి సభ్యులందరూ గత ప్రభుత్వంలో నామినేట్ చేసినవారేనని అన్నారు. అలాగే రోహిత్ కుల వివాదంపై విచారణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
హెచ్సీయూలో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కూడా గతంలో లేఖ రాసారని ప్రస్తావించారు. దురుద్దేశంతో కూడిన ప్రచారం జరుగుతోందని, రోహిత్ మృతికి కుల రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని స్మృతీ ఇరానీ విమర్శించారు. రోహిత్ సూసైడ్ నోట్ నా వద్ద ఉందని, దీనిలో విశ్వవిద్యాలయ అధికారుల పేరు లేదని, జాతీయ పార్టీల నాయకుల పేర్లు లేవని, ఎంపీ పేరు కూడా లేదని ఆమె అన్నారు. హెచ్సీయూ పాలక మండలని ఈ ప్రభుత్వం నియమించలేదని, సభ్యులందరినీ మునుపటి ప్రభుత్వమే నియమించిందని స్మృతీ తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more