Some Telugudesam party leaders demanding to Handover TTDP

Some telugudesam party leaders demanding to handover ttdp

Junior NTR, NTR, TDP, Telugudesamparty, TTDP, Chandrababu Naidu, Junior NTR as TDP Head

Some Telugudesam party leaders demanding to Handover TTDP. After long time Junior NTR name came on TDP party.

టిడిపి: ఎన్టీఆర్ టు జూనియర్ ఎన్టీఆర్ వయా చంద్రబాబు

Posted: 01/21/2016 10:18 AM IST
Some telugudesam party leaders demanding to handover ttdp

తెలుగుదేశం పార్టీ.. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో అప్పటిదాకా లోపలే ఉన్న ఆత్మాభిమానాన్ని తట్టిలేపిన పార్టీ. నిజానికి తెలుగుదేశం అంటే అది కేవలం ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ ఒక్కడే తెలుగు వారి గుండెల ఝరి నుండి వచ్చిన చప్పుడుకు ప్రతిరూపంగా పార్టీని స్థాపించారు. అయితే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను తీసుకున్నారు. ఎన్టీఆర్ ప్రభకు ఏమాత్రం తగ్గనట్లుగా చంద్రబాబు పాలన సాగించారు. అయితే చాలా మంది మాత్రం అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వారసుడు కాదు.. ఎన్టీఆర్ కు కొడుకులు లేరా..? వాళ్లే కదా టిడిపి వారసులు అని వాదన వినిపించింది. అయితే ఎందుకోగానీ ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లలో ఎవరూ కూడా తెలుగుదేశాన్ని చేతిలోకి తీసుకోలేకపోయారు.

అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో మరో సారి వారసత్వపోరు తలెత్తిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడును కాకుండా ఎన్టీఆర్ వారసులును తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరగుతున్నాయి. అందులో భాగంగానే నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో విడుదల సందర్భంగా హరికృష్ణను ఎన్టీఆర్ వారసుడిగా అతడి కొడుకులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు వర్ణించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు హరికృష్ణ రేయింబవళ్లు కష్టపడ్డారని.. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారని కళ్యాణ్ రామ్ ఎంతో ఆవేశంగా ప్రసంగించారు. అయితే అలా మాట్లాడిన కొద్ది రోజులకు ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి పగ్గాలు అప్పగించాలంటూ నినాదం వినిపించడం విశేషం.

గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు వారి గడపకు వెళ్లి తన పార్టీకి ఓటు వెయ్యాలని.. చంద్రబాబు నాయుడును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. అయితే తర్వాత మాత్రం కొన్ని కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే అంతకు ముందు హరికృష్ణను చంద్రబాబు పక్కనపెట్టడం కూడా అప్పుడు వార్తల్లో వచ్చింది. కాగా తర్వాత మాత్రం బాలకృష్ణను తెర మీదకు తీసుకురావడం.. బాలకృష్ణ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం తెలంగాణ బాధ్యతలు ఎన్టీఆర్ కు అప్పగించండి అంటూ డిమాండ్ వినిపిస్తోంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను నందమూరి కుటుంబానికే అప్పగించాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీటీడీపీ అధ్యక్ష పదవి అప్పగించాలని.. దాని ద్వారా దివంగత ఎన్టీఆర్ అభిమానులకు పార్టీలో న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ భవన్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ వినతిపత్రాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి సమర్పించారు. వారసుడి విషయంలో నాలుగేళ్ల క్రితం టిడిపిలో వివాదం తలెత్తింది. నారా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్‌లా నాడు మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఆ తర్వాత జూనియర్ రేసు నుంచి తప్పుకోవడం, లోకేష్ తెరపైకి రావడం జరిగిపోయాయి.ఇప్పుడు మళ్లీ, జూనియర్ ఎన్టీఆర్ పేరు టిడిపి వారసుడిగా తెరపైకి రావడం గమనార్హం.

మరి ఎన్టీఆర్ కు అంత అర్హత ఉందా..?
నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ గతంలోనే తెలుగుదేశం పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే అది తన పార్టీ అని గతంలో వెల్లడించారు. తన తాతగారు స్థాపించిన పార్టీ గురించి తాను ఏం చెయ్యడానికైనా సిద్దం అని వెల్లడించారు. గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు.. మాట్లాడిన తీరు అందరిని ఆకర్షించింది. రాజకీయాలకు కొత్తే కానీ ఎన్టీఆర్ ఒక్కో మాట తెలుగుదేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి నాడు తెలుగుదేశం పార్టీ గెలుపులొ కీలకంగా వ్యవహరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నిర్వహించడానికి పనికిరాడు అన్నది ప్రశ్న. ఎన్టీఆర్ సత్తా గురించి అందరికి తెలుసు కాబట్టే ఇలా ఎన్టీఆర్ ను తెర మీదకు తీసుకువస్తున్నారు.

ఎన్టీఆర్ వస్తే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం...
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉండేది. అయితే తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మాత్రం ఏపిలో బలంగా ఉన్న తెలంగాణలో మాత్రం ప్రస్తుతం తెలుగుదేశం అంపశయ్య మీద ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆక్సిజన్ గా మారతారు అన్నది వాదన. ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా వారసుడికి అవకాశం ఇచ్చినట్లు, మరోపక్క తెలంగాణలోనూ పార్టీని బతికించినట్లవుతంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  NTR  TDP  Telugudesamparty  TTDP  Chandrababu Naidu  Junior NTR as TDP Head  

Other Articles