హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పి.హెచ్.డి చేస్తున్న రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీలో చోటుచేసుకున్న రాజకీయాల వల్లే అతడు చనిపోయాడని సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. దళిత సంఘం నాయకుడిగా రోహిత్ చురుకైన పాత్రను పోషించారు. యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ లో లీడర్ గా ఎదిగారు. అయితే దేశవ్యాప్తంగా రోహిత్ ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ మెడకు ఆత్మహత్య వివాదం చుట్టుకోవడం... కేంద్ర మానవ వనరుల మంత్రి స్ర్ముతి ఇరానీ రాసిన లేఖ కూడా ఆత్మహత్యను ప్రోత్సహించిందని హైదరాబాద్ లోనే కాకుండా దేశంలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.
ఆత్మహత్య చేసుకున్న రోహిత్ దళిత విద్యార్థి నాయకుడు.. అతడికి మద్దతుగా యూనివర్సిటీలో పది మంది ప్రొఫెసర్లు రాజీనామా చేశారు. ఓ రచయిత అతడి మరణం మీద స్పందిస్తూ.. తన అవార్డును తిరిగి ఇచ్చేశాడు. దిల్లీ నుండి ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అసదుద్దీన్ ఓవైసీ, మాయావతి లాంటి నాయకులు స్పందించారు. విద్యార్థి ఆత్మహత్యను వారు తీవ్రంగా నిరసించారు. యూనివర్సిటీల్లో కుల రాజకీయాలు తగవని.. విసి, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొవాలని, బాధ్యులైన వారి మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే దళిత విద్యార్థి మీద ఇప్పటి దాకా దళిత కార్డు పట్టుకున్న నాయకుడు మంద కృష్ణ మాదిగ మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.
మందకృష్ణ మాదిగ.. ఉదయం లేచినదగ్గరి నుండి దళిత కార్డు చెప్పుకొని తన హవాను చలాయిస్తున్నారు. దళితుల మీద అగ్రవర్ణాల ఆధిపత్యం అదీ ఇదీ అంటూ తెగ ప్రసంగాలిచ్చే దళిత నాయకుడు, మట్టిలో మాణిక్యం మందకృష్ణకు హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కనిపించడం లేదా..? దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నిరసన గళం ఒక్క మంద కృష్ణకు మాత్రం ఎందుకు వినిపించడం లేదు. దళితులను కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు.. కాబట్టి రాజ్యాధికారం దిశగా అడుగులు వెయ్యాలి అని నీతివచనాలు చెప్పే మందకృష్ణ మాదిగ ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్లాడు.
రాజకీయ లాభం కోసం మాత్రమే మంద కృష్ణ దళిత కార్డు వాడుకుంటున్నాడా..? దళిత విద్యార్థి చనిపోతే కనీసం తన సంఘీభావం కూడా తెలపాల్సిన అవసరం లేదా..? దళిత నాయకుడిగా దీని మీద స్పందిస్తూ ఏదో ప్రకటన కూడా చెయ్యకుంటే ఎలా..? ఇలా సవాలక్ష ప్రశ్నలు. కానీ మంద కృష్ణ మాదిగ దగ్గరి నుండి మాత్రం సమాధానం లేదు. మందకృష్ణ మాదిగ మామూలు సమయాల్లో దళితుల కోసం పోరాడటం కాదు.. నిజంగా దళితులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రోహిత్ మీద సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత మంద కృష్ణ కనీసం ఆ విద్యార్థులకు తన సహకారాన్ని అందిస్తాననో లేదంటే మీకు అన్యాయం జరిగింది.. నేను అండగా ఉంటాననో హామీ ఇవ్వాలి కదా. కానీ ఇచ్చారా..?
ఊరూ వాడా మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడట.. దాని వెనుక రాజకీయ నాయకులకు కూడా సంబందం ఉందట అని గుసగుసలాడుకుంటున్నాయి. మీడియా మొత్తం కోడైకూస్తోంది.. కానీ మంద కృష్ణకు మాత్రం ఇవి కనిపించకుండా, వినిపించకుండా ఉంటే ఎలా..? ఇప్పుడు కూడా మంద కృష్ణ తనకేమీ తెలియదు.. తనకు పట్టదు అన్నట్లు వ్యవహరిస్తే మాత్రం చరిత్ర క్షమించదు. దళిత వర్గం ఎప్పటికి, ఏ నాయకుడు ఎన్ని చెప్పినా కానీ నమ్మదు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more