Case made for ninth planet

Case made for ninth planet

ninth planet, California, the California Institute of Technology, New Palnet

The team, from the California Institute of Technology (Caltech), has no direct observations to confirm its presence just yet. Rather, the scientists make the claim based on the way other far-flung objects are seen to move. But if proven, the putative planet would have 10 times the mass of Earth.

తొమ్మిదో గ్రహం వచ్చేసింది

Posted: 01/22/2016 08:25 AM IST
Case made for ninth planet

గతంలో గ్రహాలు ఎన్ని అంటే తొమ్మిది అని చదువుకున్నాం.. కానీ తర్వాత ఫ్లూటోకు గ్రహం గుర్తింపులేదని.. దాన్ని తొలగించారు. దాంతో నిన్నటి దాకా ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఏంటి నిన్నటి దాకా ఎనిమది గ్రహాలే అంటున్నారు.. ఇవాళ పెరిగాయా అనుకుంటున్నారుగా.. అవును తొమ్మిదో గ్రహాన్ని అమెరికా శాస్ర్తవేత్తలు గుర్తించారు. సౌర వ్యవస్థలో వెలుపల ఉన్న శకలమే అసలైన నవగ్రహమని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు బలంగా విశ్వసిస్తున్నారు. కొత్తగా గుర్తించిన గ్రహాన్ని ముద్దుగా ప్లానెట్ నైన్ (నవమ గ్రహం) పిలుచుకొంటున్నారు.

భూగ్రహ పరిమాణంలో ప్లానెట్ నైన్ పదోవంతు అని, నెఫ్ట్యూన్‌తో పోల్చుకుంటే సూర్యుడికి ఈ గ్రహం 20 వేల ఏండ్ల కాంతిదూరంలో ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. సూర్యుడి చుట్టు ఉన్న కక్ష్యలో తిరగడానికి ఈ గ్రహానికి కనీసం 10 నుంచి 20 వేల సంవత్సరాల సమయం పడుతుందని కాల్‌టెక్ వెల్లడించింది. నెఫ్ట్యూన్‌కు వెలుపల క్యూపియర్ బెల్ట్ (శని, వరుణ (యురెనస్), ప్లూటో, గురుడు, నెఫ్ట్యూన్ కూటమి)లో మం చుతో కూడిన కొన్ని శకలాలు ఉన్నాయని గుర్తించారు. ప్రాచీనకాలం నుంచి రెండు గ్రహాలను మాత్రమే కనుగొన్నామని, ఆ తర్వాత ఇది మూడో గ్రహమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం లభించిన ఆధారాలను అనుసరించి.. ప్లానెట్ నైన్‌ను కొనుగొనడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తామని కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు. త్వరలోనే సూర్యవ్యవస్థలో తొమ్మిదో గ్రహాన్ని చేరుస్తామనే ధీమా వ్యక్తంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ninth planet  California  the California Institute of Technology  New Palnet  

Other Articles