Taxi drivers in tsunami disaster zone report ghost passengers

Taxi drivers in tsunami disaster zone report ghost passengers

japan, Ghosts, Tsunami, Cabs, Taxi, drivers

Japanese taxi drivers working in one of the areas worst affected by the 2011 earthquake disaster has reported picking up 'ghost customers'. Cab drivers in Ishinomaki, where 6,000 people died when a tsunami hit the town after earthquake, say they have taken fares from people who have then vanished during the ride.

జపాన్ లో కారెక్కుతున్న దెయ్యాలు

Posted: 01/22/2016 11:25 AM IST
Taxi drivers in tsunami disaster zone report ghost passengers

దెయ్యాలేంటి.. కారెక్కడం ఏంటి..? ఇంకా ఏ కాలంలో ఉన్నావ్ అని అనుకుంటున్నారా..? కానీ నిజం. జపాన్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. జపాన్ లోని ఓ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్లు చాలా మంది తమ కార్లలో అప్పడప్పుడు దెయ్యాలు ఎక్కుతున్నాయని... మనుషులు అనుకొని ఎక్కించుకుంటే కనిపించకుండా పోయాయని వాపోతున్నారు. ఇలా ఒక్కోరో ఇద్దరో కాదు ఎంతో మంది డ్రైవర్లు చెబుతున్నారు. అసలే దెయ్యాలు తిరుగుతున్నాయాన్న వార్త వింటే ఎవరైనా షాకవుతారా లేదా..? కానీ అక్కడ మాత్రం నీ కార్లో దెయ్యం ఎక్కలేదా..? నా కార్లో రెండు దెయ్యాలు ఎక్కాయి అంటూ చర్చించుకుంటున్నారు. అయితే దీని మీద పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో వారికి కూడా ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు తెలిశాయి.

ఇషినోమాకి.. ఇది జపాన్ లో 2011లో 30 అడుగుల ఎత్తు సునామీ అలల తాకిడికి నిండా మునిగిపోయిన నగరం. వేల సంఖ్యలో ఇక్కడ ప్రాణాలుకోల్పోయారు. అయితు ఇప్పుడు అక్కడ కొంత మంది తిరిగి నివాసం ఉంటున్నారు.. ఆ నగరం తిరిగి ఊపిరిపోసుకుంటోంది. అయితే అక్కడి దెయ్యాల గురించి టాక్సీ డ్రైవర్లు చెప్పిన విషయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.  'నేనొకసారి ఒక మహిళను ఇషినోమాకి స్టేషన్లో ఎక్కించుకున్నాను. ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా మినమిహామాకు వెళ్లాలని చెప్పింది. ఆ ప్రాంతం సునామి దెబ్బకు తుడిచిపెట్టుకు పోయింది కదా అని నేను ప్రశ్నించాను. ఆ మాట విని ఆమె అయితే, నేను చనిపోయానా? అని ప్రశ్నించింది. ఆ మాట విని భయంతో వెనక్కి తిరిగి చూశాను. ఆమె ఆ సీట్లో లేదు' అని చెప్పాడు. ఇక మరో డ్రైవర్.. 'నేను కారు ఎక్కిన మనిషి చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లాను. అతడు చెప్పిన చోటు రాగానే వెనక్కి తిరిగి చూశాను. కానీ, అతడు కనిపించలేదు' అని చెప్పాడు. ఇలా అంతా ఇలాంటి అనుభవాలే చెప్పుకొచ్చారు.

దాంతో అసలు అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకుందామని కొంత మంది పరిశోధకులు చేరుకున్నారు.  2011, మార్చి 11న భూకంపం సంభవించి ఇషినోమాకిపై 30 అడుగుల ఎత్తు అలలతో సునామీ విరుచుపడిందని, ఆ దెబ్బతో దాదాపు 3,100మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించగా మరో 2,770 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ దృశ్యాలను స్వయంగా చూసిన వాళ్లలో ప్రస్తుతం డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. ఆ సునామి వల్ల వారిలో ఏర్పడిన భయం ఓ రకమైన ఒత్తిడిగా మారి అవతలి వ్యక్తికి కనిపించనివి తమకే కనిపిస్తున్నట్లుగా భ్రమపడే ఓ వింత సమస్య నుంచి బాధపడుతున్నారని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  Ghosts  Tsunami  Cabs  Taxi  drivers  

Other Articles