Chandrababu Naidu facing kaapu tension

Chandrababu naidu facing kaapu tension

Kaapu, Kaapu Reservation, AP, Chandrababu Naidu, Kaapu Reservation

AP CM Chandrababu Naidu facing new problem with kaapu group. Kaapu group conducting Kaapu Garjana today.

చంద్రబాబుకు కాపుల టెన్షన్.. రేపే కాపు గర్జన

Posted: 01/30/2016 01:13 PM IST
Chandrababu naidu facing kaapu tension

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కాపుల గర్జనకు పిలుపునిచ్చారు కాపు వర్గం నేతలు. అయితే కాపుల గర్జనకు భారీగా ఏర్పాటు జరుగుతుండటం... ముఖ్య నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి వెళుతూ ఉంటడంతో చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. ఆర్థికంగా వెనకబడిన తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కాపులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు తగు న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గతంలోనే హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలు ముగిశాయి.. కానీ బాబుగారు మాత్రం ఆ హామీ గురించి మరిచిపోయారు. అయితే తాజాగా జరుగుతున్న కాపు గర్జనకు వేల సంఖ్యలో కాపు వర్గీయులు తరలివస్తుండటంతో సర్వత్రా దీని మీద చర్చసాగుతోంది.

కాగా చంద్రబాబు నాయుడు మాత్రం బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధినేత జగన్ కాపుల గురించి మాట్లాడే హక్కులేదని మండిపడుతున్నారు. తాము కాపులకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామని.. తమ క్యాబినెట్ లో కాపు వర్గానికి చెందిన వ్యక్తికి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన అతడు గుర్తు చేస్తున్నాడు. అయితే జగన్ అండ్ కో దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. బిసీలకు, కాపులకు రిజర్వేషన్లలో తగాదా పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా నేడు జరగనున్న కాపు గర్జనలో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు, కే కేశవరావు, మాజీ మంత్రులు బొత్సా సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సినీ ప్రముఖులున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaapu  Kaapu Reservation  AP  Chandrababu Naidu  Kaapu Reservation  

Other Articles