YSCRCP leader Jagan supports Kapu protest

Yscrcp leader jagan supports kapu protest

Kapu, kapu Reservations, Jagan, Chandrababu Naidu

Jagan Mohan Reddy support the protest of kapu. He said that chandrababu naidu has to give reservations for kapu.

ITEMVIDEOS: కాపులకు నా మద్దతు: జగన్

Posted: 02/01/2016 01:54 PM IST
Yscrcp leader jagan supports kapu protest

ఏపిలో జరగుతున్న కాపు వర్గీయుల ఆందోళన మీద వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. కాపు వర్గీయులు చేస్తున్న ఆందోళనకు తాను పూర్తిగా మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిదానికి ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నిన్నటి ఘటనకు వైసీపీ నాయకులే కారణం అన్నట్లు మాట్లాడటం ఏంటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కాపులకు ఏం చేస్తాను ఎప్పుడు చేస్తాను అన్నదాని మీద చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాపులను బీసీల్లోకి చేరుస్తాను.. బీసీలకు నష్టం కలిగించకుండా అని అన్నది నువ్వు కాదా..? అని జగన్ ప్రశ్నించారు.


జగన్ మాటల్లోని ముఖ్యాంశాలు......
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చవకబారుగా మాట్లాడారు
*  5-10 శాతం మాత్రమే పాల్గొన్నారు అని చంద్రబాబు అన్నారు
* బీసీల వ్యతిరేకం అని అంటారు
* తల తోక లేకుండా మాట్లాడారు
* కాపులకు ఏం చేస్తాను ఎప్పుడు చేస్తాను అన్నదాని మీద చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు
*  ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు కేటాయించి వారి అభివృద్దికి పాటుపడతాం
*  కమీషన్ వేసి నిర్ణీత కాలంలో బీసీలకు నష్టం కలగకుండా వారికి న్యాయం చేస్తాం
* చంద్రబాబు నాయుడు అసలు ముఖ్యమంత్రేనా..?
* పులివెందులలో హింసజరిగితే పర్లేదు.. తూర్పుగోదావరి జిల్లాలో జరగడం అన్పట్లు చంద్రబాబు నాయుడు మాట్లాడారు
* మోసం చేసినందుకు క్రిమినల్ నెంబర్ వన్ గా ఎందుకు అనకూడదు..?
* డ్వాక్రా మహిళలను, రైతులను మోసం చేసినందుకు క్రిమినల్ నెంబర్ వన్ అని ఎందుకు అనకూడదు..?
* కాపులను బీసీల్లోకి చేరుస్తాను.. బీసీలకు నష్టం కలిగించకుండా అని అన్నది నువ్వు కాదా..?
* బోయలను ఎస్టీల్లో చేరుస్తానని అనంతపురంలో అన్నావు..
* హామీలను నెరవేర్చలేదని జనాలు అసహనంగా ఉన్నారు
* కాపు గర్జనను ఆపాలని అన్ని రకాలు చూశారు..
* మీటింగ్ కు దూరంగా కాపులను నిలిపివేశారు
* కాపులను కాపుల గర్జనకు హాజరు కాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు
* మీడియాను కూడా ఎమోషన్ లా బ్లాక్ మెయిల్ చెస్తున్నారు
* 1988 లోటిడిపికి వ్యతిరేకగా విజయవాడలో కాపునాడు సభ జరిగింది.. సక్సెస్ ను తట్టుకోలేక వంగవీటి మోహన్ రంగాను హత్య చేశారు. ఇదే విషయాన్ని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు.
* క్రిమినల్ బుద్ది ఉన్నది చంద్రబాబు నాయుడుకు.
* రాజకీయాలు అంటే స్పూర్తిని ఇచ్చేలా ఉండాలి
* బీసీలకు నష్టం జరగకుండా చేస్తే బీసీలు ఎందుకు ఒప్పుకోరు
* ఎస్సీ వర్గీకరణ అని మాలలకు, మాదిగలకు తగాదా పెట్టించారు.
* 22 నెలల తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపులు డిమాండ్ చేస్తే తప్పేంటి..?
* కాపులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా
 *1910 నుండి రిజర్వేషన్లు అమలు కాగా ..1956 వరకు కాపులు బీసీ
* 1956 నుండి కాపులను జీవో ద్వారా తొలగించారు
* తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఏం చెయ్యాలో మీకు తెలియదా.?
* రాజ్యాంగాన్ని సవరించి తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు సాధ్యమైంది.
* కాపు సామాజిక వర్గానికి నాదో విన్నపం.. రిజర్వేషన్లు కోరడంతో తప్పులేదు.. కాకపోతే సంయమనం పాటించాలని కోరుతున్నా

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu  kapu Reservations  Jagan  Chandrababu Naidu  

Other Articles