Anupam Kher asks Pakistan if visa was denied as he may expose terror nexus

Anupam kher asks pakistan if visa was denied as he may expose terror nexus

Anupam Kher, pakistan, Anupam Kher on Pakistan, Pakistan Visa

Confusion prevails over whether actor Anupam Kher was denied a visa for Pakistan to attend the Karachi Literature Fest. Kher claimed that he has been denied visa as he talks about India openly and is a Kashmiri Pandit who may expose Pakistan's terror nexus.

అనుపమ్ ఖేర్ కు ఫాక్ షాక్.. విసా నిరాకరణ

Posted: 02/02/2016 04:08 PM IST
Anupam kher asks pakistan if visa was denied as he may expose terror nexus

ప్రముఖ బాలివుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు పాకిస్తాన్ వీసా నిరాకరించింది. ఫిబ్రవరి 5 నుంచి మొదలయ్యే కరాచీ లిటరరీ ఫెస్టివల్ కు హాజరు కావాలని అనుపమ్ ఖేర్ భావించారు. అయితే వీసా రాలేదు. టెర్రరిస్ట్ లకు వ్యతిరేకంగా తాను మాట్లాడడం, కశ్మీరీ పండిట్ గా పాక్ టెర్రర్ సంబంధాలపై బహిరంగంగా విమర్శించడం వల్లనే తనకు పాకిస్తాన్ వీసా నిరాకరించిఉంటుందని అనుపమ్ ఖేర్ అన్నారు. తనకు వీసా ఎందుకు నిరాకరించారో కారణం చెప్పాలని ఖేర్ పాకిస్తాన్ ను కోరారు. తాను కశ్మీరీ పండిట్ కావడం వల్లనా, లేక తాను భారతీయ ఉన్నత సాంప్రదాయమైన పరమత సహనంపై మాట్లాడడం వల్లనా ఎందుకు తనకు వీసా నిరాకరించారని ట్విట్టర్ లో ప్రశ్నలు గుప్పించారు.

 

పాక్ కు చెందిన ఎందరో కళాకారులు, రచయితలు, నటులకు భారత దేశం స్వాగతం పల్కుతుంటే.. పాకిస్తాన్ తనలాంటి భారతీయ నటులపై ఎందుకు నిషేధం విధిస్తోందని ప్రశ్నించారు. పాకిస్తాన్ హైకమిషన్ మాత్రం మీరు వీసా కు దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్పించాలని కోరింది. కాగా అనుపమ్ ఖేర్ మాత్రం తన తరుపున లిటరరీ ఫెస్టివల్ ఆర్గనైజర్లు వీసాకు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. గెస్ట్ లను ఆహ్వానించే నిర్వాహకులే వారి తరుపున వీసాలకు దరఖాస్తు చేయడం ఆనవాయితీ. లిటరరీ ఫెస్టివల్ కు ప్రింట్ చేసిన పోస్టర్ లోనూ తన పేరు ఉందని. 18 మంది అతిథులను ఆహ్వానిస్తే, తనకే రాలేదని, 17 మందికి వీసాలు వచ్చాయని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anupam Kher  pakistan  Anupam Kher on Pakistan  Pakistan Visa  

Other Articles