Tension in Puranapool and Ajampura

Tension in puranapool and ajampura

MIM, Congress, Asaduddin Owisi, Hyderabad, Polling, GHMC Elections

MIM Party leaders attacked on Congress leader Shabbir ali and attacked on uttamkumars car.

ఎంఐఎం కార్యకర్తల వీరంగం... పాతబస్తీలో ఉద్రిక్తత

Posted: 02/02/2016 05:38 PM IST
Tension in puranapool and ajampura

హైదరాబాద్ లోని పాతబస్తీలో కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఖాన్నికూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా గౌస్ ఖాన్ అరెస్టును టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీలు ఖండించారు. మరో వైపు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రిని అదుపులోకి తీసుకోవడంతో కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వీరి అరెస్టుతో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా మీర్ చౌక్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కాన్వాయ్ ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకుని కారు అద్దాలు ద్వంసం చేసి ఆయన పై దాడికి పాల్పడ్డారు.

కాగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలుసుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేరుకున్నారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ రాకతో రెచ్చిపోయిన ఎంఐఎం కార్యకర్తలు ఉత్తమ్ కారు అద్దాలు ద్వంసం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. అడ్డొచ్చిన షబ్బీర్ అలీని ఎంపి అసదుద్దీన్ ఓవైసీ పక్కకు తోసేయడంతో షబ్బీర్ అలీకి స్వల్పంగా గాయాలయ్యాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM  Congress  Asaduddin Owisi  Hyderabad  Polling  GHMC Elections  

Other Articles