ప్రధాని మోదీ కాన్వాయ్ మరికొద్ది క్షణాల్లో రాబోతోంది... పక్కనే ఓ మహిళ.. తనను మోదీతో కలిసేందుకు అనుమతించాలని బ్రతిమాలుతోంది... కానీ భద్రతా సిబ్బంది మాత్రం అస్సలు అనుమతించడం లేదు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ ఒక్కసారిగా.. పక్కనే ఉన్న పూలకుండీని మోదీ కాన్వాయ్ వచ్చే రోడ్డు మీదకు విసిరేసింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సదరు మహిళను అరెస్టు చెయ్యడానికి వచ్చిన పోలీసులతో ఆ మహిళ గొడవకు దిగింది. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఆమె నానారాద్దాంతం చేసింది.
దిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. మోదీ కాన్వాయ్ కు అడ్డంగా పూల కుండీని విసరడంతో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే వెంటనే తేరుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే ఆమె స్థానికంగా ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినిగా పని చేస్తోందని తెలుస్తోంది. కాగా ఆమె ఎందుకు మోదీని కలవాలనుకుందో మాత్రం తెలియరాలేదు.
Woman refused to clear the path of PM's route, picked up a flower pot and hurled at the PM's convoy at South Block pic.twitter.com/AhFZeei66k
— ANI (@ANI_news) February 3, 2016
Policewomen take away the woman who hurled a flower-pot at PM's convoy at South Block. Unclear why she did it pic.twitter.com/OP0RWW3QEl
— ANI (@ANI_news) February 3, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more