Mudragada Padmanabham stared Hunger strike in Kirlampudi

Mudragada padmanabham stared hunger strike in kirlampudi

Mudragada, Mudragada Padmanabham, Kapu, Kapu Reservations, AP, Tuni insident

Mudragada Padmanabham stared Hunger strike in KirlampudiTDP Leaders tryed to rop the hunger strike but Mudragada did not agreed

ముద్రగడ నిరాహార దీక్ష.. చర్చలు విఫలం

Posted: 02/05/2016 08:56 AM IST
Mudragada padmanabham stared hunger strike in kirlampudi

కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు కూర్చుంటున్నట్లు ప్రకటించేశారు. తను ఒంటిరగా ఇంట్లోనే దీక్షకు దిగుతానని.. తనకు మద్దతుగా వీధుల్లో నిరసన తెలిపితే చాలని ముద్రగడ అన్నారు. తనను కలిసేందుకు, చూసేందుకు ఎవరూ రావద్దని.. వచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు. తనకు ఎలాంటి భద్రతఅక్కర్లేదని కూడా ఆయన వెల్లడించారు. కాగా అంతకు ముందు నిరవధిక నిరాహార దీక్షను విరమింపజేయడానికి టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం రాత్రి సుమారు గంట పాటు ముద్రగడ పద్మనాభంతో జరిపిన చర్చలు ఫలితాన్నివ్వలేదు. దీక్ష నుంచి వెనక్కి తగ్గడానికి ముద్రగడ పద్మనాభం టీడీపీ నాయకుల వద్ద కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. మంజునాథ కమిటీ గడువును తొమ్మిది నెలల నుంచి మూడు నెలలకు కుదించాలనేది ముద్రగడ ప్రధాన డిమాండ్-గా ఉంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీ జాబితాలో చేర్చడానికి కచ్చితమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, కాపులకు రెండు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ముద్రగడ కోరారు.

తుని సంఘటనలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ముద్రగడ కోరారు. తన దీక్షకు అడ్డు తగలవద్దని తాను టిడిపి నాయకులను కోరినట్లు తెలిపారు. తాను గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించడానికి బాధ్యత తీసుకున్న టీడిపి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఐక్య గర్జన సందర్బంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కూడా ముద్రగడ డిమాండ్ చేశారు.

కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసం మద్దతుదారులతో కిటకిటలాడుతోంది. తనకు మద్దతు తెలిపే ఉద్దేశంతో కిర్లంపూడికి ఎవరూ రావద్దని, కాపు సోదరులు ఎవరి ఇంటి ముందు వారే శుక్రవారం మధ్యాహ్నం భోజనం మానేసి ఖాళీ ప్లేట్లపై గరిటలతో శబ్దం చేస్తూ నిరసన తెలపాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎవరూ ఆత్మహత్యలు లాంటి చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. మరో పక్కన ముద్రగడ దీక్షపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం అన్ని శక్తులనూ ప్రయోగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోకి జిల్లాయేతరులు ఎవరూ రావద్దని, కేసుల్లో ఇరుక్కోవద్దని, జిల్లా వాసులు కూడా కిర్లంపూడి వెళ్ళొద్దంటూ ఎస్పీ రవిప్రకాశ్ హెచ్చరించారు. జిల్లాలో 144వ సెక్షన, పోలీసు చట్టం అమలులో ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada  Mudragada Padmanabham  Kapu  Kapu Reservations  AP  Tuni insident  

Other Articles