చింత చచ్చినా పులుపు చావదన్నది పాత సామెతజ అయితే పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను చూసిన వారు మాత్రం ఆ సామెతను కాస్తంత తిరగేసి.. ఈ చింత ఒంటి నిండా వివాదాలే అని వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే. ఎమ్మెల్యే చింతమనేని ప్రబాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మార్వో వనజాక్షి మొదలుకుని, అటవీశాఖ అదికారుల తరువాత ఎమ్మెల్యే చింతమనేని తాజాగా పోలిసు కానిస్టేబుల్ పైనే దాడి చేశాడు. ఈ మేరకు బాధిత కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాదికారులకు పిర్యాదు చేయడంతో విషయం బయటకు పోక్కింది.
తనపై దాడి చేశారని ఏలూరుకు చెందిన పోలీసు కానిస్టేబుల్ మధు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఓ సివిల్ తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కానిస్టేబుల్ మధుపై దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి.వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కోల్లేరు ప్రాంతంలో అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించారు. అదికూడా ఆటవీశాఖ అధికారుల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more