బిహార్లో దారుణం చోటుచేసుకుంది. చేతిలో చేయి వేసి నూరేళ్లు తోడుగా ఉంటానని అందరిముందు దైవ సాక్షిగా ప్రమాణం చేసిన భర్త.. అంగీకరించిన కట్నం ఇవ్వలేదని తన భార్యను తెగనమ్మాడు. పరాయి మగాడు వెంటపడితే దండించి తన భార్యకు అండగా నిలవాల్సిన ఆ భర్త.. సభ్యసమాజం సిగ్గుపడేలా తన భార్యను నీలి చిత్రాలు తీసే వారికి అమ్మడానికి సిద్ధపడ్డాడు. పెళ్లయి కనీసం నెలన్నర కూడా గడువక ముందే సంతలో వస్తువులా అమాయకురాలైన తన భార్యను రూ.7లక్షలకు పోర్న్ వీడియోలు తీసేవారికి అమ్మేశాడు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న అమె పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్లోని సరాన్ జిల్లాకు చెందిన తరయా అనే గ్రామంలో రితాదేవీ(పేరు మార్చాం)కి అదే రాష్ట్రానికి చెంది హర్యానాలోని పాటికారా అనే గ్రామంలో స్థిరపడిన టికు పాటికర్ అనే వ్యక్తికి వివాహం చేశారు. అది కూడా ఈ ఏడాది జనవరి 8న వారి ఊర్లోని ఆలయంలో సాంప్రదాయ బద్ధంగా ఈ వివాహం జరిగింది. అనంతరం ఆమెను కాపురానికి హర్యానా పంపించారు. అయితే, ఆమె కాపురానికి వెళినప్పటి నుంచి ఆ కుటుంబం రాచిరంపాన పెట్టడం ప్రారంభించారు. రూపాయి కట్నం కూడా తీసుకురాలేదంటూ కొట్టడం మొదలుపెట్టారు. రూ.2లక్షల కట్నం, ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇప్పించాలని కోరామని ఇప్పటి వరకు వాటిని ఆమె కుటుంబం ఇవ్వలేకపోయిందంటూ చిత్రహింసలు పెట్టసాగారు.
వాటన్నింటి ఆమె ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. కానీ, ఇటీవల ఆమెకు గుండెలో దడపుట్టించే వార్త తెలిసింది. ఆమెను తన భర్త పరాయివాళ్లకు అమ్మేశాడని, వారు కూడా నీలి చిత్రాలు తీసేవాళ్లకు అని తెలిసింది. తెల్లారితే ఆమెను వాళ్లు తీసుకెళతారని తెలియడంతో రాత్రికి రాత్రే తన గ్రామానికి చేరుకుంది. జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more