At Siachen Martyr's Funeral, Minister Displays Jayalalithaa's Photo On Coffin

When jayalalithaa s photo was displayed on siachen martyr s coffin

Tamil Nadu,Siachen soldier,Siachen martyr,Tamil Nadu Chief Minister,J Jayalalithaa,Madurai,Sepoy G Ganesan,AIADMK,Siachen, Martyr's, Funeral, Jayalalitha, Coffin,

Politics found its way to the funeral of a Siachen martyr on Tuesday morning, as a minister and a local administrative official decided to make a special gesture

అమర జవాను అంత్యక్రియలలోనూ ‘అమ్మ’ రాజకీయాలు

Posted: 02/17/2016 06:39 PM IST
When jayalalithaa s photo was displayed on siachen martyr s coffin

తమిళనాడులో ఏఐఏడీఎంకే మంత్రుల 'అమ్మ' భజన రోజు రోజుకు శృతిమించిగిపోతోంది. ఇప్పటికే ఈ విషయమై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నా..  వాటిని ఖండించాల్సిన పార్టీ నేతలు.. కాదేదీ అమ్మ ప్రచారానికి అనర్హం అంటూ ముందుకుదూసుకెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలలో అమ్మ మార్కును కనబడేలా చర్యలు తీసుకుంటే పర్యాలేదు కానీ అమరులైన జవానుల శవపేటికలను కూడా వదలలేదు. సియాచిన్‌లో మంచుతుపానులో చిక్కుకుపోయి అమరులైన జవాన్లకు మంగళవారం వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

తమిళనాడులోని మదురైలో సిపాయ్ గణేషన్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా తమిళనాడు సీఎం జయలలిత ఫోటో దర్శనమిచ్చింది. రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు జిల్లా కలెక్టర్ వీర రాఘవరావుతో కలిసి జవాను అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చారు. రూ. 10 లక్షల చెక్ను ప్రభుత్వం తరఫున సిపాయ్ గణేషన్‌ తల్లికి అందజేశారు. ఆ తర్వాత జయలలిత ఫోటోను శవ పేటికపై పెట్టి ఈ సాయం అందించింది తనే అంటూ జవాను తల్లికి సైగ చేశారు. దీంతో అప్పటికే ఏడుస్తూ ఉన్న ఆవిడ ఆ ఫోటో చూసి నమస్కారం చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాను శవపేటిక వద్ద రాజకీయాలు చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siachen  Martyr's  Funeral  Jayalalitha  Coffin  

Other Articles