తమిళనాడులో దారుణం జరిగింది. పద్దెనిమిదేళ్ల వివాహిత యువతిపై ముగ్గురు మగమృగాళ్లు విరుచుకుపడి అఘాయిత్యానికి తెగబడ్డారు. కోయంబత్తూర్ జిల్లాలోని వాడ్కాకి పాలయం గ్రామానికి చెందిన వివాహిత యువతి పై కప్పులేని స్నానపు గదిలో స్నానం చేస్తుండగా, అమె నగ్న ఫోటోలను అదే గ్రామానికి చెందిన మణికండన్ అనే యువకుడు తన సెల్ ఫోన్ తో తీశాడు. ఆ తరువాత సదరు వివాహితను తమ కామ వాంఛ తీర్చాల్సిందిగా బెదిరించాడు. లేని పక్షంలో అమె నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు.
ఈ నెల 15న అర్థరాత్రి వివాహిత యువతి ఇంటి వద్దకు వెళ్లిన మణికండన్ అనే యువకుడు అమెను కామవాంఛ తీర్చమని లేదంటే తదనంతర పరిణామాలకు తనది బాద్యత కాదంటూ హెచ్చరించాడు. తన భర్త ఇంట్లో వున్నాడని వద్దని ఎంత నచ్చజెప్పినా.. వినని మణికండన్ అమెను తాను అప్పటికే ఎంచుకున్న ప్రదేశానికి ఎత్తుకెళ్లి.. అమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అప్పటికే అక్కడ వున్న మరో ఇద్దరు యువకులు కూడా అమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
సదరు వివాహిత జరిగిన విషయానంతా తన భర్తకు తెలపడంతో భార్యతో కలసి వెళ్లిన భర్త పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. మణికండన్ సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని కూడా కోర్టులో స్వాధీనం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక వచ్చిన తరువాత నిందితులపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసుల తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more