village panchayat saves rape victim, fines him with rs 50,000

Village panchayat fines rape victim rs 50 thousand

village panchayat saves rape victim, rape victim fined with rs 50,000, crime against women, molestation on women, rape on teen girl, parigi rape, gollapally rape, Panchayathi, Your chastity, Rape, gollapally, nagaraju, rangareddy

An 18-year-old married girl was raped by three persons in the district after one of them took a picture of her in the nude and threatened to post the photos in social networking sites.

బాలిక శీలానికి రూ. 50 వేల ఖరీదు కట్టిన పంచాయితీ..

Posted: 02/19/2016 01:10 PM IST
Village panchayat fines rape victim rs 50 thousand

ఎక్కడొ ఉత్తర భారత దేశంలో కాప్ పంచాయితీలు, గ్రామ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని వాటికి కట్టుబడి వుండాలని హుకుం జారి చేయడం మనం అప్పడప్పుడూ వింటూనే వున్నాం.  అయితే ఈ సారి స్వయంగా దేశ 29వ రాష్ట్రంగా అవిర్భవించిన తెలంగాణలో కూడా ఇది శాసించే స్థాయికి చేరుకుంది. ఓ మగమృగానికి కొమ్ముకాస్తూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకనే విధంగా పంచాయితీ తీర్పును వెలువరించింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ఫైశాచికమృగం చేసిన తప్పిందానికి.. అమాయకురాలైన బాలిక శీలానికి అక్షరాలా రూ.50 వేల రూపాయల విలువ కట్టింది.

నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఎక్కడో కాదు రంగారెడ్డి జిల్లా పరిగి మండలం ఈ తీర్పును చవిచూసింది. బాధితురాలికి ఏలాంటి న్యాయం కావాలన్న విషయాన్ని వదిలేసిన పెద్దలు దుప్పటి పంచాయితీ ఏర్పాటు తీర్మానించిన మొత్తం ఇది. పరిగి మండలం గొల్లపల్లికి చెందిన నాగరాజు పదిహేనేళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బాలికను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు తండ్రి లేడు. తన పక్కనే నిద్రిస్తున్న తల్లి దురాగతాన్ని అడ్డుకోలేని నిస్సహాయురాలు.

దుప్పటి పంచాయితీతో తమ బిడ్డకు న్యాయం జరగడం లేదని భావించిన బాదితురాలి బంధువులు ఎట్టకేలకు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన దారుణంపై గురువారం ఉదయమే బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందరు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి శీలానికి వేలం కట్టారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panchayathi  Your chastity  Rape  gollapally  nagaraju  rangareddy  

Other Articles