అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అగ్రిగోల్డ్ యజమాన్యానికి కొమ్ముకాస్తూ అన్ని విషయాల్లో వారికి సహకరిస్తున్నారని మండిపడింది. తాము చెప్పినప్పుడే వారిని అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదని వ్యాఖ్యానించింది. కిందికోర్టులో నిందితులకు బెయిల్ వచ్చేందుకు సహకరిస్తే సీఐడీ అధికారితోఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించింది. అంతేగాక అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.6 లక్షలే ఉన్నట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది.
పది వేల కోట్ల ఆస్తుల వివాదంలో రూ.6 లక్షలు మాత్రమే ఉండటంలో అర్థమేంటని సీఐడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. బ్యాంకు ఖాతాల్లో నిధులన్నీ ఎక్కడకు వెళ్లాయని నిలదీసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ వేర్వేరుగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది.
వేలం పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అగ్రిగోల్డ్ భూముల వేలంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఏ ఒక్క బిడ్డర్ ముందుకు రాలేదని, అందువల్ల ధరను పునఃసమీక్షించి మరోసారి బిడ్లను ఆహ్వానిస్తామన్నారు. ఆస్తులు సరైన స్థితిలో లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం కారణమని చెప్పడంపై.. ధర్మాసనం స్పందిస్తూ.. ఆస్తులన్నీ వివాదరహితమైనవన్న విషయాన్ని కొనుగోలుదారుల దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టు ఆదేశాలమేరకే వేలం వేస్తున్నట్లు, వేలం ప్రక్రియ ముగిసి సొమ్ము చెల్లించగానే వారికి యాజమాన్యపు హక్కులు సంక్రమిస్తాయని, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రావని చెప్పాలని సూచించింది.
అగ్రిగోల్డ్ నిందితుల బెయిల్ వ్యవహారంలో సంబంధిత కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తగిన ఆదేశాలిచ్చేలా సీఐడీకి మార్గనిర్దేశం చేయాలని కృష్ణప్రకాశ్కు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తున్న విషయాన్ని పీపీలద్వారా సంబంధిత కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టంచేసింది. నిందితులకు బెయిలిచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి, బెయిలొచ్చేందుకు సహకరిస్తే ఊరుకునేది లేదని, దర్యాప్తు అధికారిని ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more