school girls from gujarat not allowed to use mobile phones

Gujarat village bans mobile phone for school girls

gujarat girls not allowed to use mobiles, mehsana district girls mobile phones, minor girls of mehsana district village, minor girls resticted mobiles, Gujarat village, Mobile phone, ban, School girl

A village in Mehsana district of Gujarat has banned minor girls from using or owning mobile phones claiming that the gadget distracts them from studies.

గుజరాత్ లో అమ్మాయిలు మొబైల్ ఫోన్ వాడితే జరిమానా..!

Posted: 02/22/2016 01:11 PM IST
Gujarat village bans mobile phone for school girls

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రమారమి ఏడు పదుల దాటుతున్నా.. దేశంలోని మహిళలకు మాత్రం ఇంకా స్వతంత్ర్యం రాలేదని చెప్పాలి. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ సుమారుగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్రంలోనే ఈ దారుణమైన స్థితిగతులను మహిళలు ఎదుర్కోంటున్నారంటే.. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థిలతులు ఎలా వున్నాయో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ప్రతీదీ స్మార్ట్ ఫోన్ సాయంతో చేతిలో ఉంటుంది.
 
 కానీ ఆ ఊళ్లో మాత్రం, పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే చాలు జరిమానా విధిస్తారు. ఆ సమాచారాన్ని అందించిన వాళ్లకు బహుమతి ఇస్తారు. గుజరాత్ లోని సూరజ్ అనే ఊళ్లో ఈ వింత ఆచారాన్ని మొదలెట్టారు. ఎప్పటినుంచో కట్టుబాట్ల మధ్య ఉన్న ఆ ఊరు మొబైల్ ఫోన్లు వచ్చాక స్పీడ్ అయిపోయింది. ప్రేమ దోమ అంటూ కుర్రకారు మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని భావించిన ఊరిపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పెళ్లి కాని అమ్మాయిలకు మాత్రమే ఈ కండిషన్. ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ దొరికిపోతే, రెండు వేల వరకూ జరిమానా పడుతుంది.
 
ఇదేం వింత ఆచారంరా బాబూ అనుకుంటున్నారా..? అమాయకురాళ్లైన ఆడపిల్లల్ని, కుర్రాళ్లు ఫోన్లలో మాట్లాడే బుట్టలో వేసుకుంటున్నారు. అలా మాట్లాడే వాళ్లలో పెళ్లి చేసుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటున్నారు. అందుకే ఆడపిల్లలు మోసపోకూడదనే ఇలా చేశాం అని గ్రామపెద్దలు సమాధానం చెబుతున్నారు. ఫోన్ అనేది ఉపయోగం కంటే వ్యసనంగా మారిపోయిందని, త్వరలోనే పిల్లలకు కూడా ఈ రూల్ పెట్టబోతున్నామని చెబుతున్నారు. నరేంద్రమోడీ సొంత ఊరికి, ఈ ఊరు చాలా దగ్గర్లోనే ఉండటం విశేషం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Gujarat village  Mobile phone  ban  School girl  

Other Articles