ఫేస్‌బుక్.. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సోషల్ నెల్ వర్కింగ్ సైట్. అయితే దీని నుంచి మంచి ఎంతో వుందో అంతకన్నా అధికంగా చెడకు కూడా యువత ప్రభావితం అవుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు అమాయకుల ప్రాణాలను బలితీపుకోవడంతో పాటు అనేక మందిని దోషులుగా కూడా మార్చింది. లండన్ లో ఓ హెయిర్ డ్రెస్సర్ జీవితాన్ని ఫేస్ బుక్ ఏకంగా మార్చేసింది. అదెలా అంటారా..? ఫేస్‌బుక్ వీపరీతంగా వాడతున్న తన బోయ్‌ఫ్రెండ్ ను అమె ఏకంగా హత్య చేయడమే ఇందుకు కారణం. నేరం రుజువు కావడంతో అమెకు అక్కడి న్యాయస్థానాలు 12 ఏళ్ల జైలుశిక్ష విధించాయి.
గతేడాది ఆగస్టులో జరిగిన హత్య ఘటనలో పూర్తి వివరాలిలా ఉన్నాయి. టెర్రీ మారీ పామర్ అనే యువతి హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తుండేది. నిరుద్యోగి అయిన ఆమె బోయ్ ఫ్రెండ్ డామన్ సియర్సన్ ఇటీవలే ఓ మొబైల్ ఫోన్ కొన్నాడు. అందులో ఫేస్‌బుక్ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. తన అర్ధనగ్న ఫొటోలు కూడా విపరీతంగా పోస్ట్ చేసేవాడు. అలా.. అతడి వాడకం శృతిమించింది. దాంతో బాగా విసిగిప ఓయిన పామర్.. అతడ్ని చంపేయాలని నిర్ణయించుకుంది. గతేడాది ఆగస్టు13వ తేదీన బోయ్ ఫ్రెండ్ సియర్సన్‌ను గుండెల్లో కత్తితో పలు పోట్లు పొడిచి హత్యచేసింది. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకుని స్వయంగా తానే అత్యవసర సేవల నంబర్ 999కు కాల్ చేసింది. తన లవర్ పొరపాటున కత్తితో పొడుచుకుని గాయపడ్డాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఆరు నెలల విచారణ తర్వాత పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒక్కక్కటిగా బయటపడ్డాయి. బోయ్ ఫ్రెండ్ లేకపోవడంతో తనకు చాలా బోరింగ్‌గా ఉందని ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పంపిన ఆమె... సియర్సన్ వ్యవహారం నచ్చకనే అతడ్ని చంపేశానంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. కొత్త ఫోన్ కొన్న తర్వాత ఫేస్‌బుక్ అతిగా వాడటం, కొత్త స్నేహాలు పెంచుకోవడమే సియర్సన్ మృతికి కారణమయ్యాయని పోలీసులు వివరించారు. తనను వదిలించుకోవాలని ప్రయత్నించాడని, వేరొక యువతిలో సన్నిహితంగా ఉంటున్నాడని భావించి ప్రియుడ్ని హత్యచేసినట్లుగా పామర్ కోర్టులో చెప్పింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more