Rukmani Devi Arundale Google doodle

Rukmani devi arundale google doodle

Rukmani Devi Arundale , Google doodle, Doodle, Google, Bharatratna

Commemorating the 112th birth anniversary of renowned Bharatnatyam dancer Rukmani Devi Arundale, search giant Google has posted a doodle on its India homepage. Rukmani Devi Arundale was not only a Bharatnatyam dancer and choreographer but also worked as an activist for animal rights and welfare.

నాట్యకారిణి రుక్మిణీదేవి డూడుల్

Posted: 02/29/2016 09:46 AM IST
Rukmani devi arundale google doodle

భారత నాట్య శిరోమణి, సాంఘిక సేవా దీక్షితురాలు, జంతుప్రేమి, థియోసఫిస్ట్ శ్రీమతి రుక్మిణి దేవీని గూగుల్ గౌరవంగా సత్కరించింది. రుక్మిణి దేవీ 112వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటాన్ని గూగుల్ డూడుల్‌లో ప్రదర్శించడం జరిగింది. డూడుల్ అందరినీ ఆకట్టుకునేలా.. నాట్య శైలిలో పొందుపరిచారు. రుక్మిణి దేవీ నృత్య విద్య, సాంఘిక సేవలను గుర్తించిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం 1956లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 1952, 56లో రాజ్యసభ సభ్యురాలుగా పని చేశారు. 1904, ఫిబ్రవరి 29న మధురైలో జన్మించారు. 1986, ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచారు.

నాట్య శిరోమణిగా కీర్తిపతాకాలను ఎగరవేసిన రుక్మిణీ దేవి తన కెరీర్ లో ఎన్నో పురస్కారాలను, సన్మానాలను పొందారు. నృత్య విద్యా, సాంఘిక సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956’’పద్మ భూషణ్ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .విశ్వ భారతి ‘’దేశికోత్తమ ‘’అవార్డును ప్రదానం చేసింది .సంగీత నాటక ఎకాడేమి ,పురస్కారాన్ని, ఫెలోషిప్ ను అంద జేసింది .భారత జంతు సంక్షేమ సంస్థ ‘’ప్రాణి మిత్ర ‘’ను ,లండన్ లోని ‘’రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ ‘’సంస్థ ‘’క్వీన్ విక్టోరియా సిల్వర్ మెడల్ ‘’,నుఇచ్చాయి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘’కాళిదాస సమ్మాన్ ‘’పురస్కారం అందించి సత్కరించింది .అమెరికాలోని వేన్ విశ్వ విద్యాలయం గౌరవ డాక్ట రేట్ ను ,లాస్ ఏంజిల్స్ కౌంటి అండ్ సిటి వారు ‘’స్క్రోల్ ఆఫ్ ఆనర్ ‘’అందజేసి గౌరవించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rukmani Devi Arundale  Google doodle  Doodle  Google  Bharatratna  

Other Articles