Delhi High Court grants bail to ​JNUSU president Kanhaiya Kumar

Kanhaiah kumar gets 6 months interim bail

Kanhaiya Kumar,Kanhaiya Kumar bail, Kanhaiya Kumar, Interim bail, Delhi Court JN University, jnu, jnu row, kanhaiya kumar bail, jnu, kanhaiya kumar news, jnu news, delhi high court

JNU student Kanhaiya Kumar was granted bail today by the Delhi High Court, nearly three weeks after he was arrested on sedition charges

జేఎన్యూ విద్యార్థి సంఘం నేత మధ్యంతర బెయిల్,,

Posted: 03/02/2016 08:09 PM IST
Kanhaiah kumar gets 6 months interim bail

భారతజాతికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆందోళన చేపట్టాడన్న అభియోగాల నేపథ్యంలో దేశద్రోహం కేసులో అరెస్టైన జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనిపై కేసును నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు పాటియాల న్యాయస్థానంలో హాజరుపర్చారు.  విచారణ ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ కు 6 నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

పది వేల రూపాయల పూచికత్తు సమర్పించాల్సిందిగా జస్టిస్ ప్రతిభా రాణి ఆదేశించారు. అఫ్జల్‌గురు ఉరిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో నిర్వహించిన సభలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో తొలుత కన్హయ్యను, ఆ తర్వాత మరికొందరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన మరో ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించిన కోర్టు.. కన్హయ్యకు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiya Kumar  Interim bail  Delhi Court JN University  

Other Articles