అసలే చిన్నదైన జీవితం.. దాంట్లో కలహాలు, కల్మషాలతో ఇంకా చిన్నది చేసుకోవడమేందుకు.. వీలైతే ప్రేమిద్దాం బాస్ .. ఏం చేస్తారు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతేగా.. అన్న డైలాగ్ సృష్టించిన సెన్సెషన్ ఎంతో మనకు తెలుసు. ప్రభాస్ నటించిన మిర్చీ సినిమాను సూపర్ డూపర్ హిట్ స్థాయికి తీసుకువెళ్లిందీ ఈ చిన్న డైలాగ్. అయితే ఇంతటి చక్కటి మెసేజ్ లో వచ్చిన సినిమాను చూసి కొందరు నిజంగానే అందరినీ ప్రేమించడం మొదలుపెట్టారట.
అయితే ఈ చిత్రం చూసి మారాడో.. లేక ఈ చిన్నారిని చూసిన తరువాతే ఈ చిత్రాన్ని తీశారో తెలియదు కానీ.. సరిగ్గా మిర్చి చిత్రంలో ప్రభాస్ మాదిరిగా ఈ చిన్నారి కూడా అందరికీ పలుకరిస్తూ వెళ్లడం నెట్టింట్లో సంచలనం రేపుతుంది. ఏడాదిన్నర వయస్సు కూడా లేని చిన్నారి అప్పుడే సోషల్ మీడియాలో హీరోగా వెలిగిపోతున్నాడు. చిన్నారి వీడియోను చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా, ఇక లైకులు కూడా విపరీతంగా వచ్చి చేరుతున్నాయి. అదెలానో మీరే చూడండి
చిన్నారుల స్వభావానికి విరుద్దంగా ఈ 16 నెలల చిన్నారి షాపింగ్ మాల్లో కనిపించిన ప్రతివారిని పలుకరించుకుంటూ వెళ్తున్నఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'లవ్ వాట్ మ్యాటర్స్' పేరుతో ఫేస్బుక్ పేజీలో మూడు వారాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 46 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఈ వీడియోలో బుడిబుడి అడుగులతో షాపింగ్ మాల్ మొత్తం కలియతిరుగుతున్నజాయ్ అనే చిన్నారి కనిపించిన ప్రతివారిని పలుకరిస్తూ వెళ్లింది. షాపింగ్ చేస్తున్న వారిని, షాప్లో పనిచేస్తున్న వారిని ఇలా తనకు ఎదురు పడిన ప్రతివారిని పలుకరించింది. చివరికి అక్కడ షాపింగ్ చేస్తున్న ఓ మహిళ వద్దకు వెళ్లి ఏ మాత్రం బెరుకు లేకుండా హగ్ కూడా చేసుకోవడం విశేషం.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more