nandamuri-balakrishna-apology-for-his-comments-on-women

Balakrishna apologises for his sexist comments

balakrishna speech at savitri audio launch, balakrishna apologies for his comments in savitri audio launch, balakrishna about women, balayya funny speeches, balakrishna, savitri audio launch, women's day, apology

Nandamuri Balakrishna, who made a few shocking comments, while speaking at Savitri audio launch, a couple of days ago, corrected his comments and explained his intention.

తన వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళలకు బాలయ్య క్షమాపణలు..

Posted: 03/08/2016 10:36 AM IST
Balakrishna apologises for his sexist comments

మహిళల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, వారిని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. 'సావిత్రి' సినిమా ఆడియో ఫంక్షన్ లో తాను అమ్మాయిల వెంటపడితే తన అభిమానులు ఊరుకోరని, ఇష్టమైతే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఉవ్వెత్తున విమర్శలు రావడంతో. ఆయన మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పారు.

తన వ్యాఖ్యలతో ఎవరైనా నోచ్చుకుని వుంటే వారిని మన్నించాలని కోరారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరినట్టు భావించొద్దని కోరారు. మహిళలను ఇంటి ఆడపడుచులుగా చూడడం తమ సంప్రదాయమని పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గుణం అని వివరించారు. ఏ ఇంటి మహిళలైనా తమ ఇంటి ఆడపడుచులుగా చూడటం తమ చిన్ననాటి నుంచి అలావాటని పేర్కొన్నారు.

 సినిమా వేడుకలో సరదాగా మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, సినిమాలో కథాపరంగా సన్నివేశాల గురించి చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బాలకృష్ణపై కేసు నమోదు చేయాలని న్యాయవాదుల జేఏసీ సోమవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాదులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  savitri audio launch  women's day  apology  

Other Articles