International Women’s Day: Congress MP Ranjeet Ranjan rides on motorbike to Parliament

Congress mp ranjeet ranjan rides a bike to the parliament

ranjit ranjan, women mp on bike, ranjit ranjan ride motorbike, harley davidson, international women's day, Congress MP Ranjeet Ranjan, ranjeet ranjan bike, pappu yadav,

Ranjan, who came to Parliament riding a Harley Davidson bike, believes that reservation in Lok Sabha was not the solution but part of a larger effort needed to empower women

పార్లమెంటుకు బైక్ పై వచ్చిన మహిళా ఎంపీ..

Posted: 03/08/2016 02:30 PM IST
Congress mp ranjeet ranjan rides a bike to the parliament

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా వున్న మహిళామణులు ఘనంగా వేడుకలను జరుపుకుంటున్నారు. దేశంలోని ఐసిఐసిఐ బ్యాంకు మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమహోం అవకాశాన్ని కల్పించగా, దేశీయ మొబైల్ తయారీ సంస్థ కార్భన్ యాజమాన్యం కూడా మహిళలకు ఆపర్ ప్రకటించింది. ఇవాళ తమ మొబైల్ ఫోన్లను కొన్న మహిళలకు డిసౌంట్ అఫర్ ప్రకటించింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా  మహిళలు తమ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

కాగా అందరిలోకి కొంత విభిన్నంగా వుండాలని భావించిన ఈ పార్లమెంటు సభ్యురాలు మాత్రం అటు మీడియాతో పాటు ఇటు సహచర పార్లమెంటుసభ్యుల దృష్టిని ఒక్క ఉదుటున ఆకర్షించారు. అదెలా అంటారా.. అమె తన కారులో కాకుండా ఏకంగా ద్విచక్ర వాహనం.. అందులోనూ అత్యంత ఖరీదైన, వేగంగా దూసుకెళ్లే బైక్ ను నడిపిస్తూ పార్లమెంటుకు రావడంతో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇలా కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ పార్లమెంట్ ఆవరణలో హల్చల్ చేశారు.

ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ బైకుపై ఆమె లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. హెల్మెట్ పెట్టుకుని.. హార్లీ డేవిడ్‌సన్ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ పార్లమెంటుకు చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. వివాదాస్పద బిహారీనేత పప్పూ యాదవ్ భార్య రంజీత్,  బిహార్ లోని సౌపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా  గెలుపొందారు. 2014 ఎన్నికల్లో భర్త ఆర్జేడీ నేతగా  క్రియాశీల రాజకీయాల్లో ఉంటే,  ఆమె మాత్రం కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాంగ్రెస్‌కు బలంగా  వీస్తున్న వ్యతిరేక పవనాల్లో ఆమె విజయాన్ని  సాధించారు.

ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఇవాళ పార్లమెంటు మహిళా ఎంపీలు మాత్రమే మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించడంతో.. అధిక సంఖ్యలో మహిళా ఎంపీలు పార్లమెంటుకు చేరుకోవడంతో పార్లమెంటు ఉభయ సభలు కళకళలాడుతున్నాయి. ఉదయం నుంచి మహిళా పార్లమెంటు సభ్యుల ప్రసంగాలతో పార్లమెంటు నడుస్తుంది. అయితే కేవలం ఏడాదికి ఒక్క రోజు కాకుండా కనీసం వారానికి ఒక్క రోజు తమ గోంతు వినిపించే అవకాశాన్ని ఇవ్వాలని పలువురు మహిళా ఎంపీలు కోరుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress MP  Ranjeet Ranjan  rides  bike  Parliament  

Other Articles