Sri Sri ravishankar refused to pay fine

Sri sri ravishankar refused to pay fine

Sri Sri ravishankar, the National Green Tribunal, the Yamuna flood plains

Even as a defiant Sri Sri Ravi Shankar said that he will rather go to jail than pay the Rs 5 crore fine for 'damaging' Yamuna floodplains, the National Green Tribunal (NGT) bench said on Thursday that "if there is any breach (of its order), law will take its own course." The Art of Living (AOL) Foundation founder told a private news channel on Wednesday that they will contest the NGT chairperson bench order that held it liable for "drastically tampering with the Yamuna flood plains".

జరిమానా కట్టేది లేదన్న రవిశంకర్.. అవసరమైతే జైలుకు

Posted: 03/11/2016 08:13 AM IST
Sri sri ravishankar refused to pay fine

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో ఢీ కొట్టేందుకు ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ సిద్ధమయ్యారు. ట్రిబ్యునల్‌ విధించిన జరిమానాను కట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే జైలుకెళ్లేందుకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. జరిమానా కట్టేది లేదన్న ఆయన వ్యాఖ్యలతో ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వేడుకల ప్రారంభోత్సవంపై ఉత్కంఠ నెలకొంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు, ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ సంస్థకు మధ్య వివాదం ముదురుతోంది. యమునా నది ఒడ్డున తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమం కోసం పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారంటూ.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌కు 5 కోట్లు ప్రాథమిక జరిమానా విధించింది. జరిమానా చెల్లించి కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ మాత్రం ట్రిబ్యునల్‌ తీర్పుపై మండిపడ్డారు.

ఎట్టి పరిస్థితుల్లో జరిమానా కట్టేది లేదని శ్రీశ్రీ రవిశంకర్ తెగేసి చెప్పారు. జైలుకైనా వెళ్తాం గానీ ఒక్కపైసా కట్టబోమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమం కోసం ఒక్క చెట్టూ కొట్టేయలేదని తెలిపారు. ఉత్సవాల కోసం నిర్మిస్తున్న కట్టడాలన్నీ తాత్కాలికమైనవేనని, కార్యక్రమం పూర్తయిన వెంటనే వాటిని తొలగిస్తామని రవిశంకర్‌ పేర్కొన్నారు. జరిమానా కట్టేది లేదన్న శ్రీశ్రీ రవిశంకర్‌ వ్యాఖ్యలపై నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి. 26 కోట్లతో నిర్వహించనున్న ఈ ఉత్సావాల ప్రారంభోత్సవాలకు ప్రధాని హాజరు కానుండడం, జరిమానా కట్టేది లేదంటున్న శ్రీశ్రీ రవిశంకర్‌ మొండిపట్టు నేపథ్యంలో.. ఉత్సవాల ప్రారంభోత్సవంపై ఉత్కంఠ నెలకొంది. బ్యునల్‌ విధించిన జరిమానాను కట్టేది లేదని ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ తేల్చి చెప్పారు. అవసరమైతే జైలుకెళ్లేందుకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదన్న ఆయన.. ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీలుకు వెళతామన్నారు. జరిమానా కట్టేది లేదన్న ఆయన వ్యాఖ్యలతో యమునా తీరంలో తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వేడుకల ప్రారంభోత్సవంపై ఉత్కంఠ నెలకొంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Sri ravishankar  the National Green Tribunal  the Yamuna flood plains  

Other Articles