తాను కేవలం భారత దేశ వ్యాపారిని మాత్రమే కాదని, అంతర్జాతీయ స్థాయి వ్యాపార ప్రముఖుడినని మీడియా సంస్థలు గుర్తుంచుకోవాలని, తాను ఎక్కడికీ పారిపోలేదని ఇవాళ ట్విట్లతో తనదైన శైలిలో వాదనలు వినిపించిన వ్యాపారి విజయ్ మాల్యాపై దేశవ్యాప్తంగా నిరసలు వినబడుతున్నాయి. నిన్న తమిళనాడులో తన భర్త తీసుకున్న అప్పుకు కోట్టారు.. మరి మాల్యానేని చేస్తారని ఓ భార్య పోలీసులను నిలదీసిన వైనం మనకు కనబడింది. దేశవ్యాప్తంగా మాల్యాపై నిరసనలు పెల్లుబిక్కుతున్న తరుణంలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ డాన్.. మీడియాపై విరుచుకుపడ్డారు.
తాను చేసిన సహాయాలను మారువరాదని, పలు సందర్భాలలో తాను వారికిచ్చిన తాయిలాను కూడా గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. అంతటితో ఆగని మాల్యా.. తాను ఓ మీడియా ప్రముఖ ప్రాతికేయుడిని జైలు వస్త్రాలలో, జైలు అన్నం తింటూ చూడాలనుకుంటున్నట్లు కూడా వ్యాఖ్యానించడం ఆయనకే చెల్లింది. ఇక అటు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రం సాయం లేకుంటే దేశం నుంచి మాల్యా ఎలా తప్పించుకుని వెళ్తారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మాల్యాను కేంద్రమే దేశం నుంచి పంపించిందని అరోఫణలు బలంగా వినబడుతున్నాయి.
విజయ్ మాల్యా అంశం నేపథ్యంలో అటు కేంద్రంతో పాటు ఇటు మిత్రపక్ష బీజేపిపై, మోడీ సర్కారుపై శివసేన నిప్పులు చెరిగింది. విజయ్ మాల్యా ఒక భారత ఆర్థిక ఉగ్రవాది అని అభివర్ణించింది. అలాంటి వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కేంద్ర ప్రభుత్వమే పెద్ద రక్షణ కవచంగా నిలుస్తోందని మండిపడింది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ యూపీఏ హయాంలో లెక్కలేనన్ని లోన్లు ఇచ్చారని.. ఇప్పుడేమో వాటిని ఎగ్గొట్టి పారిపోయేందుకు ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొంది.
శుక్రవారం తన అధికారిక పత్రిక సామ్నాలో శివసేన ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వేల కోట్లలో కుంభకోణానికి పాల్పడి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కాక ఎదుర్కొంటున్న మాల్యాకు కేంద్ర ప్రభుత్వమే రక్షణగా నిలిచిందని కథనం వెలువరించింది. 'పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విజయ్ మాల్యా ఓ భారత ఆర్థిక ఉగ్రవాది' అని సామ్నా పేర్కొంది. 'మాల్యాకు అనుకూలంగా ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారు. అందుకే ఇంతపెద్ద మొత్తం కుంభకోణం జరిగింది. ఇప్పుడు అదే నాయకుల సహాయం తీసుకొని మాల్యా పారిపోయాడు' అని సేన ఆరోపించింది.
దేశంలో వున్న మాల్యాను దేశం దాటించిన తరువాత.. మళ్లీ దేశానికి తీసుకువస్తామని చెప్పడం హాస్యస్పదమని మండిపడింది. అర్థిక ఉగ్రవాది మాల్యా విషయంలో చేతులు కట్టుకుని వున్న కేంద్రం, పాకిస్థాన్ లో అక్కడి ప్రభుత్వ రక్షణలో వున్న అండర్ వరల్డ్ డాన్, భారత మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంను మాత్రం దేశానికి తీసుకువస్తామని చెప్పడం కూడా విడ్డూరంగానే వుందని విమర్శించింది. ఇప్పటికే ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోడీ అంశంలో రేగిన వివాదం తరువాత కూడా లలిత్ మోడీని దేశీనిక తీసుకువస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా ఏ చర్యలు తీసుకుందో కూడా చెప్పాలని శివసేన విమాండ్ చేసింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more