విజయ్ మాల్యా కొన్ని నెలల క్రితం వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఈ పేరు వింటే ఇప్పుడు చాలా మందికి వణుకుపుతోంది. మరికొంత మందికి కోపం వస్తోంది. తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులను బ్యాంకుల నుండి తీసుకొని దేశం వదిలి ఎంచక్కా ఎగిరిపోయిన ఈ బడా బిజినెస్ బాబు మీద దేశంలో చాలా మందికి కోపంగా ఉంది. మొన్నామధ్యన ఓ రైతు బ్యాంకు రుణాన్ని తీర్చకపోతే.. పోలీసులు లాఠీలతో బాదడంతో అతడి బార్య పోలీసుల మీద తిరగబడి.. విజయ్ మాల్యా లాంటి వ్యక్తి తొమ్మిది వేల కోట్లు నొక్కితే ఏమనరు కానీ నా భర్తను చితకబాదుతారా అని ప్రశ్నించింది. వీలైతే విజయ్ మాల్యాను కూడా ఇలా నే కొడతారా అని నిలదీసింది. తాజాగా మరో మహిళ ఫైన్ కట్టమంటే విజయ్ మాల్యాను తీసుకురండి కడతా అని రచ్చ చేసింది.
ప్రేమలతా భన్సాలీ అనే మహిళ ముంబై సబర్బన్ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ మహాలక్ష్మి రైల్వేస్టేషన్ వద్ద టికెట్ చెకింగ్ అధికారికి పట్టుబడ్డారు. టికెట్ లేనందుకు 260రూపాయలు జరిమానా కట్టాలని అడిగితే, బ్యాంకులకు 9వేల కోట్ల అప్పున్న విజయ్ మాల్యాను అరెస్టు చేసి, ఆయనతో ఆ సొమ్ము కట్టించాలని.. అప్పుడు తాను జరిమానా కడతానని చెప్పారు. అలా దాదాపు 12 గంటల పాలు రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు. విజయ్ మాల్యాను ఏమీ అనకుండా వదిలేసి, ఆయన వస్తానన్నప్పుడే రావాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న అధికారులు సామాన్యులను మాత్రం ఎందుకింత వేధిస్తున్నారని ప్రశ్నించారు. చివరకు ఆమె భర్త రమేష్ భన్సాలీని పిలిపించినా ఆయన కూడా ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని.. అంతా ప్రేమలత ఇష్టమేనని స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకున్న రైల్వే పోలీసులు.. ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆమె జరిమానా మాత్రం కట్టనని, కావాలంటే జైలుకు వెళ్తానని చెప్పిందట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more