Holi offer: Now, book your Vistara tickets for Rs 999

Vistara announces special holi fares

Vistara, vistara Holi offer, Vistara discount offer, vistara domestic offer, vistara economy offer, vistara premium economy offer, Tata Sons, Singapore Airlines, Aviation Sector, India Business Report

Vistara aims to increase the total number of flights to 580 a week from the current 317 with the proposed induction of four new Airbus A320 aircraft.

హోలికి విస్తార బంఫర్ ఆఫర్.. రూ. 999కే విమానం టిక్కెట్

Posted: 03/23/2016 03:44 PM IST
Vistara announces special holi fares

దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించే విస్తార విమానయాన సంస్థ కూడా చౌక ధర విమానయాన పోటీలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ కింద డిస్కౌంట్ ప్రయాణాలను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా విస్తారా విమానయాన సంస్థ కూడా హోలీ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ చార్జీలను అందిస్తోంది. ఈ హోలీ ప్రత్యేక చార్జీలు రూ.999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

అయితే, దీనికి పన్నులు, ఇతర చార్జీలు అదనమని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఒక వైపు విమాన చార్జీలు ఎకానమీ క్లాస్‌కు రూ.999 నుంచి, ప్రీమియమ్ ఎకానమీ క్లాస్‌కు రూ.2,299 నుంచి మొదలవుతాయని వివరించింది. ఈ ప్రత్యేక చార్జీలకు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నెల 28 అర్థరాత్రి వరకూ ఉంటుందని, సీట్లు పరిమితమని తెలిపింది. తామందించే అన్ని దేశీయ రూట్లకు ఈ చార్జీలు వర్తిస్తాయని, కొత్త రూట్లు-జమ్ము, శ్రీనగర్, కోచిలకు కూడా ఈ చార్జీలు వర్తిస్తాయని విస్తార పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles