Mormon miracle: Missionary Mason Wells incredibly survives terror attacks in Boston, Paris and Brussels

Brussels terror attack is 2nd major bombing utah teen has survived

Brussels,brussels attacks,brussels explosions,brussels bombings,brussels airport atatck,Mormon Mason Wells,mormons injured brussels,mormon brussels boston marathon,Mormon missionary brussels,brussels terrorist attack,brussels attacks suspects

A Mormon missionary who was injured during the explosion at Brussels airport was also present at the Boston Marathon bombing, and in Paris during the terrorist attacks in November.

19 ఏళ్ల ఈ యువకుడు నిజంగా అదృష్ట జాతకుడే..

Posted: 03/24/2016 09:59 AM IST
Brussels terror attack is 2nd major bombing utah teen has survived

శివుడి అజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నానుడి. అందుకేనేమో భారీ బాంబు దాడులు జరుగుతున్న అక్కడి నుంచి స్వల్ప గాయాలతో భయటపడి అదృష్టజాతకుడిగా మారుతున్నాడు. అదేంటి ఓకసారి బాంబు దాడి నుంచి తప్పించుకుంటే అదృష్టవంతుడా..? అంటే ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు బాంబు దాడుల నుంచి తప్పించుకున్నాడు. తాజాగా జరిగిన బ్రస్సెల్స్ విమానాశ్రయం బాంబు దాడి నుంచి కూడా తప్పించుకున్నాడు. గట్టిపిండమని రుజువు చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన మాసన్ వెల్స్ (19).. బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతడు ఈ దాడిలో గాయపడ్డాడు. వెల్స్ తలకు గాయమైంది, కొన్నిచోట్ల ఏవో గుచ్చుకున్నాయి, చాలాచోట్ల కాలినగాయాలు కూడా అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం మాత్రం తప్పింది.ఇంతకుముందు 2013 ఏప్రిల్ నెలలో బోస్టన్‌ మారథాన్ పోటీలు జరిగినప్పుడు కూడా అతడు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. స్వయంగా అతడి తల్లి ఆ రేసులో పాల్గొన్నారు. వెల్స్, అతడి తండ్రి కలిసి చూస్తుండగా.. ఉన్నట్టుండి భూమి కంపించినట్లు అనిపించింది. అక్కడ ఉగ్రవాదులు పెట్టిన ప్రెషర్ కుక్కర్ బాంబు కేవలం ఒక బ్లాకు దూరంలో పేలింది. దాంతో అప్పుడు కూడా కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ఇక గత నవంబర్‌లో జరిగిన ప్యారిస్ ఉగ్రవాద దాడుల సమయంలోనూ వెల్స్ అక్కడే ఉన్నాడు. వెల్స్ ప్యారిస్ వెళ్లాడని ముందే తెలియడంతో, ఉగ్రదాడి విషయం తెలియగానే అతడి తండ్రి చాడ్ వెల్స్ వెంటనే అతడి గురించి ఆందోళన చెందారు. దాదాపు 8 గంటల తర్వాత అతడితో మాట్లాడగలిగారు. అప్పటికి అతడికి సర్జరీ కూడా అయిపోయింది. అదృష్టం బాగుండి అప్పుడు కూడా కొంత గాయపడ్డాడు గానీ, బతికే ఉన్నట్లు తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. దేవుడు వెంట ఉండబట్టే ఆ కుర్రాడు ప్రతిసారీ ఉగ్రదాడుల స్థలంలోనే ఉన్నా ప్రాణాలతో బయట పడుతున్నాడని వెల్స్ కుటుంబ స్నేహితులైన క్రిస్ లాంబ్సన్ చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : masson wells  three terror attacks  youth survives  american teen  

Other Articles