mother tries to drag her daughter into prostitution

Shocking stepmother forces daughter into prostitution

step mother forces daughter into prostitution, step mother compells daughter, mother engages rowdies, saifabad police, step mother, molestation, rape, gangrape, molestation on women, harrassment on women, attrocities on women, rape on women, sex racket, prostitution, mother, daughter, hyderabad, old city, star hotels

In a Shcoking incident, step Mother forced her daughter into prostitution in saifabad of Hyderabad.

తల్లే.. కూతురికి మత్తిచ్చి.. స్టార్ హోటళ్లల్లో వ్యవభిచారం చేయించింది..

Posted: 03/26/2016 01:44 PM IST
Shocking stepmother forces daughter into prostitution

భాగ్యనగరంలోని పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. తల్లే.. కూతురును బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దించి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. తల్లే.. తన కూతురును వ్యభిచార రొంపిలోకి దింపిన ఘోర విషయం వెలుగు చూడటంతో స్థానికులు షాకింగ్ కు గురిచేసింది. కూతురుకు మత్తు మందు ఇచ్చి, స్టార్ హోటళ్లకు పంపించి వ్యభిచారం చేయించిందని తెలియడంతో స్థానికులు అమెకు శాపనార్థాలు పెట్టారు. బాధితురాలి తండ్రిని ఐదో వివాహం చేసుకున్న ఈ కసాయి తల్లి.. తల్లి అన్న పిలుపుకే అపఖ్యాతిని తీసుకోచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. తన భర్త మెదటి భార్యకు జన్మించిన కూతురు డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులకు చుదువకునేందుకు తన సవతి తల్లి అంగీకరించలేదు. సరికాగా అమెతో బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపేందుకు యత్నించింది. తాను వ్యభిచారం చేయనని తెగేసి చెప్పిన కూతురికి మత్తుమందు ఇచ్చి.. వ్యభిచారం చేయిందచేందుకు యత్నించిందని బాధితురాలు తెలిపింది. పలుమార్లు తనకు మత్తుమందు ఇచ్చిన తరువాత స్టార్ హోటళ్లకు పంపించింది.

అదే అదునుగా చేసుకున్న బాధితురాలు తనను తాను కాపాడుకునేందుకు ఇదే మంచి తరుణమని అక్కడి నుంచి తప్పించుకుంది. మరుసటి రోజు తమ బంధువుల ఇంటికి చేరుకుని అక్కడ తలదాచుకుంది. ఈ విషయం తెలిసిన సవతి తల్లి, రౌడీలతో వెళ్లి అక్కడ గొడవ చేసింది. అంతేకాకుండా తన కూతురు కనిపించడం లేదంటూ, బంగారం దొంగలించిందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన యువతి... జరిగిన విషయం పోలీసులకు తెలిపింది.

తన తల్లి తనను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపాలని యత్నించిందని, అందుకోసం తనకు మత్తుమందు కూడా ఇచ్చి అపస్మారక స్థితిలో వున్న తనను స్టార్ హోట్లళ్లకు పంపాలని కూడా చూసిందని.. తనకు ఇష్టంలేక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు కూడా అండగా నిలిచి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లితో పాటు అమె రౌడీలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mother  daughter  prostitution  star hotels  sex racket  saifabad  hyderabad  telangana  

Other Articles