Lion Cannot Sleep Without His Blanket

Lion cannot sleep without his blanket

Lion, Blanket, Lion with blanket, America, Vicky

Vicky Keahny, his rescuer from In-Sync Exotics, had heard that Lambert had slept in bed with the grandfather of the family. So when she rescued him, she gave him a blanket. Lambert curled up inside it and immediately fell asleep.

ITEMVIDEOS: దుప్పటి కప్పుకునే సింహం. చూశారా..?

Posted: 03/30/2016 12:48 PM IST
Lion cannot sleep without his blanket

అడవికి రారాజు అలాంటి పులి గడ్డి తింటే అంటే ఎవరైనా నవ్వుకుంటారు. పులి గడ్డి తినడం ఏంటి అనుకుంటారు. మరి అదే పులి రోజు రాత్రి దుప్పట్టి కప్పుకొని పడుకుంటే ఎలా ఉంటుంది. ఏంటి జోక్ చేస్తున్నానని అనుకుంటారా..? కాదు అస్సలు కాదుజ ఇది నిజం. మృగరాజు సింహం అమెరికాలో రోజు దుప్పటి కప్పుకొని పడుకుంటోంది. అసలు దుప్పటి లేకపోతే కనీసం నిద్ర కూడా పోవడం లేదంటే ఎంతలా అలావాటైంతే అర్థం చేసుకోవచ్చు. అయితే సింహం దుప్పటి కప్పుకోవడం ఏంటి అని ఇంకా మీకు డౌట్ ఉంటే ముందు ఈ వీడియో చూడండి. తర్వాత మొత్తం స్టోరీ చదవండి.

అమెరికాకు చెందిన ఓ కుటుంబం చిన్నపిల్లగా ఉన్న ల్యాంబర్ట్ అనే ఆఫ్రికా సింహాన్ని తెచ్చుకుని పెంచుకున్నారు. కొంతకాలం తర్వాత దాన్ని వదిలించుకోవాలని  దానికి ఆహారం పెట్టకుండా వదిలేశారు.అప్పుడే ల్యాంబర్ట్.. ఇన్సింక్ ఎక్జాటిక్స్ అనే జంతు సంరక్షణశాల డైరెక్టర్ విక్కీ కంట పడింది. చిన్నకుక్క పిల్లలా.. నీరసంగా ఉన్న దాన్ని ఇన్సింక్ ఎక్జాటిక్స్ కి తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి పరుపుపై పడుకునే అలవాటుండేదని దాన్ని పెంచిన యాజమానులు విక్కీకి చెప్పారు. దాంతో విక్కీ దాని కోసం ఓ దుప్పటి తెచ్చి బోన్ లో వేశాడు. అంతే ఆ దుప్పటి చూసిన ఆనందంలో ల్యాంబర్ట్ వెంటనే దాన్ని చుట్టేసుకుని పడుకుందట.
 
అప్పటినుంచి దానికి రోజూ ఓ దుప్పటి ఇస్తూనే ఉండేవాడట. ప్రస్తుతం ల్యాంబర్ట్  వయసు రెండేళ్లు. ఇది పెంపుడు జంతువుగా పెరిగింది కాబట్టిఅడవుల్లో ఉండలేదని విక్కీ తన వైల్డ్ లైఫ్  హౌస్లోనే పెట్టుకున్నాడు. దీని కోసం ఏకంగా 7000 చదరపు అడుగుల స్థలం కేటాయించాడు. ఆడుకునేందుకు గడ్డితో మైదానం, ఓ ఈతకొలను కూడా కట్టించాడు. అయితే ఎంత పెద్దవుతున్నా లాంబర్ట్  దుప్పటిని వదిలి మాత్రం పడుకోలేదని చెప్తున్నాడు విక్కీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lion  Blanket  Lion with blanket  America  Vicky  

Other Articles