తెలంగాణ సర్కార్ పై కాగ్ మొట్టికాయలు వేసింది. అనవసరంగా అప్పులకు తావిస్తోందని మండిపడింది. .వ్యాట్ నిబంధనల ప్రకారం తనిఖీలు చేయని ఫలితంగా 45 కోట్ల 92 లక్షల నష్టం వాటిల్లినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. గుత్తేదారు టర్నోవర్లు తప్పుగా నిర్వహించడం వల్ల 8 కోట్ల పన్ను తక్కువగా విధించినట్టు స్పష్టం చేసింది. 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులను శాఖల వారీగా కాగ్ వెల్లడించింది. వ్యవసాయ, సహకార శాఖకు 5 వేల 380 కోట్ల 31 లక్షలు, నీటిపారుదల శాఖకు 8 వేల 52 కోట్ల 87 లక్షలు, ఇంధన శాఖకు 3 వేల 504 కోట్ల 49 లక్షలు, మౌలిక వసతుల పెట్టుబడులను 2 వేల 598 కోట్ల 97 లక్షలుగా తేల్చింది.
మధ్యాహ్న భోజన పథకం నిధులను ఐదేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగించలేదని కాగ్ నివేదిక తేల్చింది. ప్రాథమిక తరగతుల్లో అర్థంతరంగా చదువు మానేస్తున్న వారి సంఖ్య 26 శాతం ఉందని స్పష్టం చేసింది. బీబీనగర్ నిమ్స్ అభివృద్ధి పనులు ఆగిపోయి 80 కోట్ల నష్టం వాటిల్లిందన్న కాగ్... ప్రణాళికాలోపం వల్ల హైదరాబాద్ నిమ్స్‌లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందటం లేదని ఆరోపించింది. మీసేవా కేంద్రాల పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కాగ్ ప్రభుత్వానికి సూచించింది.
‘అప్పులపై రంధి వద్దు. ఎలాంటి భయం వద్దు. ఇతర ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా తెలంగాణ అప్పులు తక్కువే! పైగా ఆదాయం భారీగా పెరుగుతోంది. 2019-20కి వార్షిక బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటుతుంది’- ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో అన్న మాటలివి. కానీ, కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాత్రం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పులు తీర్చడానికి మరో రెండేళ్ల తర్వాత కొత్త అప్పులు తప్పవేమోనని పేర్కొంది.
రాష్ట్రంలో 2014-15కు సంబంధించి ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సమర్పించింది. ‘‘రాష్ట్రంలో 2015 మార్చి 31నాటికిగల బాకీల మెచ్యూరిటీ ప్రొఫైల్ పరిశీలిస్తే, బాకీల్లో 49.32 శాతం మాత్రమే ఏడేళ్లు, అంతకుమించి గడువు కలిగి ఉన్నాయి. అంటే, సగానికిపైగా బాకీలను ఏడేళ్లలోపే చెల్లించాలి. తీర్చాల్సిన రుణాలు రూ.73,542 కోట్లదాకా ఉంటే వాటిలో ఏడేళ్లు, ఆపైన గడువులో తీర్చాల్సినవి రూ.36,269 కోట్లు. ఇందులోనూ 2018-20 మధ్య రూ.13,721 కోట్లు, 2020-22 మధ్య రూ.13,886 కోట్లమేరకు చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ సంవత్సరాల్లో బడ్జెట్‌పై భారం తప్పదు. కాబట్టి మరిన్ని అప్పులు చేయాల్సి రావచ్చు’’నని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more