ఎవరూ ఊహించని పరిణామం. టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ గెలుపు చూసిన వారంతా షాకయ్యారు. 6 బంతులు... 19 పరుగులు.. రెండు జట్లు పోటాపోటీగా సాగిన మ్యాచ్. క్లైమాక్స్ లో సిక్సర్ల మోత మోగింది. క్లైమాక్స్ లో సిక్సర్ల మోతతో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ తడిసి ముద్దైంది. హోరాహోరీ జరిగిన మ్యాచ్ లో అద్యంతం ఇంగ్లండ్, వెస్టిండీస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. చివరకు అదృష్టం విండీస్ ను వరిస్తే.. దురదృష్టం ఇంగ్లండ్ ను వెక్కిరించింది. రెండోసారి వెస్టిండీస్ పొట్టి క్రికెట్ లో ప్రపంచ విజేతగా నిలిచింది.
చేజింగ్ బెటర్ అనుకున్న విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రూట్, బట్లర్ రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 155 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లు బ్రాత్ వెయిట్ 3, బ్రావో 3 వికెట్లు పడగొట్టారు.156 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఏ దశలోనూ పోటీలో కనిపించలేదు. 5 పరుగులకే 2 వికెట్లు పోవడం.. అందులో గేల్ కూడా ఉండడం కరేబియన్లను కలవరపెట్టింది. కానీ ఫస్ట్ డౌన్ లో వచ్చిన శామ్యూల్స్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 85 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శమ్యూల్స్ కు కాసేపు బ్రావో అండగా నిలబడితే.. చివర్లో వచ్చిన బ్రాత్ వెయిట్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కప్ చేజారుతున్న దశలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ నుంచి కప్ లాగేసుకున్నాడు.
చివరి ఓవర్లో 4 వరుసల బంతుల్లో 4 సిక్సర్లు బాది.. వెస్టిండీస్ కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్.. ఇప్పుడు ఆ దేశంలో విలన్ గా మారిపోయాడు. అండర్ 19 వరల్డ్ కప్ వెస్టిండీస్ గెలిచింది... ఉమెన్ టీ20 వరల్డ్ కప్ కూడా వెస్టిండీసే గెలిచింది. మెన్స్ టీ20 వరల్డ్ కప్ కూడా వెస్టిండీసే గెలిచింది. అలా వెస్టిండీస్ అదిరిపొయే పర్ఫామెన్స్ తో అంతకు మించిన అదృష్టంతో దూసుకుపోతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more