Cop Booked for Sending Obscene Messages to Woman

Case booked on circle inspector for sending obsecene messages

Cop Booked for Sending Obscene Messages to Woman, CID inspector, Nirbhaya Act, Karimnagar, Deputy Superintendent of Police J Rama Rao, Dayakar Reddy, circle inspector, CID wing ci Karimnagar, obscene messages, social media websites, dsp rama rao

An inspector was booked for allegedly sending obscene messages online to a woman, police said here.

విచారణ పేరుతో మహిళపై వేధింపులు.. సీఐడీ సిఐపై నిర్భయ కేసు..

Posted: 04/04/2016 11:39 AM IST
Case booked on circle inspector for sending obsecene messages

కంచె చేను మేసిందన్నట్లుగా ఆయనే తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఏఎస్ఐ కేసులో విచారణ అధికారి. ఈ కేసులో లోతును, లోటుపాట్లను కనిపెట్టాల్సిన అధికారిగా వుంటూ ఒ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని వేధించాడు. అచ్చంగా పోకిరి సినిమాలో ఇన్స్ పెక్టర్ పాత్ర తరహాలో వ్యవహరించాడు. సదరు ఉద్యోగినికి భర్త లేడని తెలుసుకున్న ఆయన మరింతగా రెచ్చిపోయి.. అమెకు అభ్యంతరకర మేసేజ్ లను పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఎంతలా అంటే వాటిని తట్టుకోలేక సదరు అధికారిపైనే ఆ ఉద్యోగిని ఉన్నతాధికారులకు పిర్యాదు చేసేంతలా..

దీంతో వక్రబుద్ది పట్టిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ పై పోలీసులు ఏకంగా నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ ఏఎస్ఐ మోహన్ రె్డి అక్రమ దందాపై  ఏర్పాటు చేసిన సిఐడి బృందంలో సభ్యుడిగా కోనసాగుతున్న సిఐడి ఇన్స్ పెక్టర్ దయాకర్‌రెడ్డి.. ఓ మహిళ పట్ల నిర్ధయగా వ్యవహరిచిన తీరుపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దయాకర్ రెడ్డి ఫోన్ లిస్ట్, ఈ మెయిల్, వాట్సప్ ల వివరాలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీ చెందిన భాదిత మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. అమె భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. అక్రమ ఫైనాన్స్ కేసులో అరెస్ట్ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా అతడి బంధువులను సీఐడీ అధికారులు కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి విచారణ చేశారు. బాధిత మహిళ కూడా మోహన్‌రెడ్డి బంధువు కావడంతో ఆమెను కూడా విచారణకు పిలిపించారు.

విచారణ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫొన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత నుంచి తరచూ ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఎదైనా అంటే విచారణలో భాగమే అంటూ ఇబ్బంది పెట్టేవాడు. కొద్ది రోజుల తర్వాత రోజుకు వందలాది కాల్స్ చేయడం, వాట్సప్ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా నిరంతరంగా వచ్చి పడుతున్న మెసేజ్‌లతో మహిళ చాలా ఇబ్బంది పడింది. ఫోన్ చేయొద్దని, మెసేజ్‌లు పెట్టొద్దని కోరినా సీఐ మారలేదు.

అసభ్యకరమైన బొమ్మలతో కూడిన  మెసేజ్‌లు బయటకు  చెప్పుకోలేని మెసేజ్‌లు పెట్టేవాడు. వారం రోజుల నుంచి సీఐ చేష్టలు శ్రుతిమించడంతో భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దయాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దయాకర్‌రెడ్డికి చెందిన వాట్సప్ నంబర్లు, మరో ఫొన్ నంబర్‌కు చెందిన పలు వివరాలు, కాల్‌లిస్టు సేకరించారు. బాధిత మహిళకు సెల్ ద్వారా, వాట్సప్ నంబర్ ద్వారా పంపించిన మెసేజ్‌లకు సంబంధించిన డేటా సేకరించారు. సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తూ విచారణకు వచ్చిన మహిళను వేధించడంపై  మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles