transgenders slam actress turned politician kushboo in chennai

Transgenders protest against politician kushboo outside congress party office

congress leader kushboo, transgenders, politices, elections, tamil nadu assembly elections, Actress Kushboo, Insulted, congress party, tamil nadu, election, kushboo in trouble, kushboo controversial comments

Actress turned politician kushboo being targeted by transgenders for her comments on rethinking of contesting elections, outside congress party officce at chennai

మళ్లీ చిక్కుల్లో కుష్బూ.. మండిపడుతున్న హిజ్రాలు..

Posted: 04/05/2016 09:47 AM IST
Transgenders protest against politician kushboo outside congress party office

ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కుష్బు మరోమారు వివాదాస్పద వ్యాక్యలతో చిక్కుల్లో చిక్కుకున్నారు.  తన ప్రవర్తన, ముక్కుసూటి తత్వంతో కోరి చిక్కుల్లో చిక్కుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. అయితే ఈ సారి అమెను హిజ్రాలు టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చారు. కాంగ్రెస్ జాతీయ మీడియా ప్రతినిధి అయిన కుష్బూ ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశమే తాజా వివాదానికి కారణం. తాజాగా కుష్బూకు వ్యతిరేకంగా హిజ్రాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో భాగంగా అమె ఓ ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికలలో పోటీ చేయడంపై హిజ్రాలు పున:పరిశీలన చేసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎన్నికలలో పోటీ చేయాలని హిజ్రాలు ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై వారు ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. కుష్బు వ్యాఖ్యలను ఖండించిన హిజ్రాలు, వెంటనే అమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తేూ హిజ్రాలు చెన్నై కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ ఉత్తర భారతదేశానికి చెందిన కుష్బు గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన మహిళల శీలాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇప్పుడు హిజ్రాల విషయంలోనూ అదేవిధంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. అమె ఏం మాట్లాడినా చెల్లిపోతుందన్న బావనలో వున్నారని అది మంచిది కాదని సూచించారు. అమె వ్యాఖ్యలు ఆవేదన కలిగించిందన్నారు. కుష్బు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని హిజ్రాలు స్పష్టం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Kushboo  Insulted  congress party  tamil nadu  election  

Other Articles