Bengal CM Mamata Banerjee dares PM Modi to send her to jail

Mamata banerjee hits back at pm modi terms bjp as bhayanak jali party

Mamata Banerjee, narendra modi, Arrest, vivekananda nagar bridge, amit shah, BJP, TMC, west bengal assembly elections, bengal elections, elections 2016, mamarta banerjee, jail, election rally, terror, maut, corruption,cpi(m)-congress alliance,

Trinamool Congress supremo Mamata Banerjee on Saturday attacked Prime Minister Narendra Modi for accusing her party of corruption and dared him to send her to jail.

దమ్ముంటే నన్ను అరెస్టు చేయగలరా..? ప్రధానికి మమత సవాల్..

Posted: 04/10/2016 10:00 AM IST
Mamata banerjee hits back at pm modi terms bjp as bhayanak jali party

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంత ప్రయత్నించినా.. బిజేపి పశ్చిమ బెంగాల్ లో తమ సత్తా చాటుకోలేదని ప్రీఫోల్ సర్వేలు స్పష్టం చేసినా.. బీజేపి మాత్రం పశ్చిమ బెంగాల్ లో తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది, ఈ నేపథ్యంలో బిజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తరువాత ప్రధాని నరేంద్రమోడీ పశ్చిమ బెంగాల్ లో పర్యటనలు చేస్తూ సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ తనపై అవినీతి ఆరోపణలు చేయడంపై మమతా బెనర్జి మండిపడుతన్నారు, నిజంగా ప్రధానిమోదీకి ధైర్యముంటే తనను అరెస్టు చేయాల్సిందిగా దీదీ సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రాంతాల్లో మోదీ ప్రసంగిస్తూ టీఎంసీని టెర్రర్, మాత్ (మృత్యు), కరప్షన్ పార్టీ అని సంభోధించారు. కోల్ కతాలో ఫ్లై ఓవర్ 21మంది మృతి చెందిన విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన దీదీ శనివారం అసాన్ సల్ లో జరిగిన ఎన్నికల సభలో బీజేపీనీ భయానక్ జాలీ పార్టీగా పేర్కొన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న మోదీకి ధైర్యముంటే తనను అరెస్టు చేయాల్సిందిగా సవాల్ విసిరారు. తాను మోదీలాగా వ్యక్తిగత విమర్శలు చేయనని అన్నారు. ప్రధాని ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటారని ఆయన వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. మన్ కీ బాత్ లో  మాటలు మాట్లాడటం తేలికని పనులు చేయడం నేర్చుకోవాలని మోదీకి సూచించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  narendra modi  Arrest  vivekananda nagar bridge  amit shah  BJP  TMC  

Other Articles