pawan kalyan says he is responsible for his statements on behalf of jenasena

Pawan kalyan janasena to contest elections in 2019

pawan kalyan, janasena party, pawan kalyan interview, pawan kalyan cine career, 2019 elections, sardaar gabbar singh, pawan kalyan financial crisis, pawan kalyan fourth coming movies, chiranjeevi, mega fans, mega family members

power star and janasena president pawan kalyan says his party will be ready to contest elections in 2019

ITEMVIDEOS: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బరిలోకి నిలుస్తుంది..

Posted: 04/10/2016 08:09 PM IST
Pawan kalyan janasena to contest elections in 2019

2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. విభజన సమస్యల మీద తాను పోరాడుతానని ఆయన తెలిపారు. పోరాటంలో దిగితే సాధించి తీరుతానని ఆయన అన్నారు. తానేం చేయాలో తనకు తెలుసని, దానిని సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నానని ఆయన చెప్పారు. విత్తనం వేయగానే పళ్లు, కాయలు రావని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఏం చేసినా చెప్పి చేస్తానని ఆయన తెలిపారు.

ప్రజల గొంతు వినిపించాలనేదే తన తపన అని పవన్ చెప్పారు. తాను విజయం సాధిస్తానా? లేదా? అన్నది తరువాత అని, ప్రయత్నలోపం లేకుండా శాయశక్తులా పోరాటం మాత్రం చేస్తానన్నారు. మెగా ఫ్యాన్స్ అని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని తేడాలు, విభేదాలు లేవని పవన్ స్పష్టం చేశాడు. అన్నయ్యతో రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ, ఆయనను వ్యతిరేకించేత అభిప్రాయ భేదాలు ఉండవని పవన్ స్పష్టం చేశాడు. ఎవరు ఏమనుకున్నప్పటికీ ఆయన తరువాతే తానని చెప్పాడు. అన్నయ్య స్థానం అన్నయ్యదేనని పవన్ తెలిపాడు. అభిమానుల్లో తనను ఇష్టపడే వారు ఉన్నప్పటికీ వారికి అన్నయ్య అంటే వ్యతిరేకత ఉండదని పవన్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని...ఈ పద్ధతిని ఎవరో ఒకరు మార్చాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ వెంటనే మళ్లీ చెబుతూ, 'ఎవరో మార్చడం ఎందుకు? ఈ మార్పుకు నేనే నాంది పలుకుతా'నని ఆయన అన్నారు. భావదారిద్ర్యం తనకు నచ్చదని, ఉన్నత ఆశయాలు లేకపోతే అది దౌర్భాగ్యం కిందే లెక్క అని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే దానికి చాలా బలమైన కారణం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు పార్టీలు మారుతున్నారో అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. సిద్ధాంతాలు లేని నాయకులుంటే ఇలాగే ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తాను చాలా బాధపడ్డానని పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పట్లో ప్రజల తరపున మాట్లాడే నాథుడు కనపడలేదని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు, పాలకులు చేసిన తప్పులకు ప్రజలను బాధ్యులను చేసి విభజన చేశారని ఆయన మండిపడ్డారు.

Video Source: NTV

తెలంగాణ వెనుకబాటు తనానికి బాధ్యత రాజకీయ నాయకులదైతే దానిని ప్రజలను బాధ్యులుగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ప్రజల్లో మనిషినేనని, అందుకే బాధపడ్డానని ఆయన చెప్పారు. ఈ విభజన సందర్భంగా ఒక్క నాయకుడు కూడా ప్రజల పక్షాన నిస్వార్ధంగా మాట్లడలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను చెప్పిన ఏ మాటా మర్చిపోలేదని ఆయన స్పష్టం చేశారు. గొడవ పెట్టుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.

తన మనసులో చాలా ప్రణాళికలు ఉన్నాయని, వాటిని వెల్లడించే సమయం కోసం చూస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపాడు. తనపైన, తన సినిమాలపైన అంచనాలు ఎక్కువగా ఉంటాయని పవన్ కల్యాణ్ చెప్పాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, ఆ అంచనాలను తాను రీచ్ అవ్వలేనని అన్నాడు. అందుకే తానెప్పుడూ కలెక్షన్లు, విజయాలు, అపజయాలను చూసి ఉత్సాహానికి గానీ నిరుత్సాహానికి గానీ గురికాలేదని ఆయన తెలిపాడు. 'అత్తారింటికి దారేది' సినిమా తరువాత తనతో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని పవన్ చెప్పాడు.

దీంతో, తప్పని సరి పరిస్థితుల్లో తనంత తానుగా పెన్నుపట్టాల్సి వచ్చిందని, ఆ అవసరమే కథ రాసేలా చేసిందని పవన్ పేర్కొన్నాడు. తనకు సినీ పరిశ్రమలో మార్కెట్ ఎలా ఏర్పడిందో తెలియదు కానీ చాలా మార్కెట్ ఉందని అన్నాడు. తనతో సినిమాలు తీయాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని పవన్ చెప్పాడు. తనతో సినిమాలు తీసేందుకు చాలా మంది ఉన్నారని, అయితే డబ్బులున్నాయి కదాని తీద్దామని భావించే వారే ఎక్కువని, ఇమేజ్, అభిమానులను అంచనాలు... వంటి బాధ్యతలన్నీ తీసుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, అందుకే తాను పెన్నుపట్టాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పాడు. త్వరలో తాను త్రివిక్రమ్, ఎస్ జే సూర్యతో సినిమాలు చేస్తానని ఆయన వెల్లడించాడు. సినిమాను ఏదో తూతూ మంత్రంగా పూర్తి చేయడం తనకు నచ్చదని, ఏ పని చేసినా వంద శాతం చిత్తశుద్ధితో చేయాలని భావిస్తానని ఆయన తెలిపాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Pawan Kalyan  Sardhar Gabbarsingh movie  tollywood  

Other Articles