Man Plans A Lavish Wedding For 100 Poor Girls While His Son Has A Simple Ceremony

Surat businessman is planning lavish weddings for 100 poor girls

Surat Businessman, Gopal Vastapara, 100 daughter, mass marriages, lavish weddings, vaibhav, surat real estate businessman, India Wedding, Mass Wedding, Save the Girl Child, Positive, socially and economically backward families, Vastapara's native village Chamardi, Amreli district, Rajkot district

Gopal Vastapara, a real estate developer from Surat, is planning to get 100 girls, from not so well to do families, married in a lavish ceremony on 28th April.

నయనానందకరం.. ఒకే వేదికపై 100 మంది కూతుళ్లకు పెళ్లి..

Posted: 04/14/2016 03:51 PM IST
Surat businessman is planning lavish weddings for 100 poor girls

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది పాత సామెత. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాదిరిగా ఇప్పటికీ, ఎప్పటికీ పేద, మద్యతరగతి కుటుంబాలను అట్టిపెట్టుకుని వుండే సామెత. ఈ వర్గాల ప్రజలకు వారింటి అడపడచుకు పెళ్లి చేసి పంపించడం అంతే మామాలు విషయం కాదు. ఇక రెక్కడితే కానీ డొక్కాడని కుటంబాలకు కూడా తమ అమ్మాయిల పెళ్లికి అప్పుల పాలవుతుంటారు. పెళ్లంటే నూరేళ్ల పంటే కాదు, కన్నవారిని అప్పుల ఊబిలోకి తోసేటి తంట అంటే అతిశయోక్తి కాదేమో. అయితే దానాలన్నింటికన్నా కన్యాదానమే మిన్న అన్న సత్యాన్ని తెలుసుకున్న వారు మాత్రం పెద కుటుంబాలలోని అమ్మాయిల వివాహాలకు ఎంతో కొంత సాయం చేస్తూ పుణ్యం, పురుషార్థం సంపాదించుకుంటారు.

ఈ ఫుణ్యమేదో ఒక్కింత అధికంగా కావాలని చేస్తున్నాడో.. లేక ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తనకు, తన కుటుంబానికి, వ్యాపారానికి కలసి వస్తుందనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఓ పెద్ద మనస్సున్న పెద్దాయన వంద మంది పేదింటి అడపడుచుల వివాహాలను తన చేతులు మీదుగా జరింపించేందుకు నడుంబిగించాడు. సూరత్‌కి చెందిన ఒక వ్యక్తి ఒకేసారి వందమంది అమ్మాయిలకు పెళ్లి చేయబోతున్నాడు. ఈ నెల 28న ఈ పెళ్లీలకు ముహుర్తం పెట్టించాడు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా, చామ్రాది గ్రామానికి చెందిన గోపాల్ వస్తపర అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ కార్యాన్ని చేయనున్నాడు.

పెళ్లిఖర్చులు భరించలేని కుటుంబాలను ఎంచుకుని వారి పెళ్లిళ్లు ఘనంగా చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందుకు అమ్రేలీ, రాజ్‌కోట్ జిల్లాల్లోని గ్రామాలను ఎంచుకున్నాడు. కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా అందరికీ ఒకే వేదికపై ఈ వివాహాలు జరిపించనున్నాడు. సర్వ ధర్మం, సర్వ సమాజం అనే నినాదంతో గోపాల్ వస్తపర ముందుకెళ్తున్నాడు. ఈ వివాహ వేడుకకు వధూవరుల తరపు నుంచి 60,000 మంది అతిధులు హాజరు కానున్నారు. ఈ వంద మంది నా బిడ్డలతో సమానం. అందుకే వారందరికీ చీర, సారెలతో ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుత అంటున్నాడీ దానకర్ణుడు.

మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చామార్ది అనే ప్రాంతంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. ప్రతీ పది సంవత్సాలకు వంద మందికి ఇలా పెళ్లి చేసి తన దానగుణాన్ని చాటుకుంటున్నాడు గోపాల్ వస్తపర. ఎంత వ్యాపారంలో కలసి వచ్చినా.. విందులు, వినోదాలు, విలాసాలు సలపడానికే సమయం దక్కని సంపన్నులెందరో వున్న మన దేశంలో.. మానవత్వంతో తనకు కలసివచ్చిన ధనాన్ని పేదింటి పిల్లలను తమ పిల్లలుగా భావించి, వారికి కన్యాదానం చేయడం చిన్న విషయం కాదు. భారత దేశం సంపన్న దేశమని సంపద అంటే ధనమని భావించడం కాదు.. దాతృత్వం వున్న వస్తపర లాంటి వాళ్లు మెండుగా వున్న సంపన్న దేశం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surat Businessman  Gopal Vastapara  India Wedding  Mass Wedding  Save the Girl Child  Positive  

Other Articles