three-year-old Indian boy who charmed Kate by stamping on her feet

Tiny dancer is just like naughty george says royal couple

‘naughty’ toddler, Kangkan Baruah, duke and duchess, cambridge, prince george, william, kate middleton, Kaziranga National Park, assam, royal couple, Assam's Kaziranga National Park, Kuthuri Tishri Bihu Doll troupe, Krishna Kant Baruah, Mala Baruah,

The ‘naughty’ toddler who captured the hearts of the Duke and Duchess of Cambridge when he stamped on their feet in a special dance was told by William he reminded him of Prince George.

రాజ దంపతులకు యువరాజు జార్జ్ ను గుర్తుచేసిన బుడతడు..

Posted: 04/14/2016 09:04 PM IST
Tiny dancer is just like naughty george says royal couple

భారత పర్యటనకు వచ్చిన రాజదంపతులకు భారత చిన్నారి వారి అబ్బాయి యువరాజు జార్జ్ ను గుర్తుచేశాడు. వారు భారత దేశ పర్యటనకు వచ్చిన నాటి నుంచి ఎంతో మంది చిన్నారులను చూసివుంటారు. అయితే ఈ చిన్నారి ప్రత్యేకత ఏమిటీ..? ఎందుకు అతన్ని చూసి వారు తమ యువరాజును గుర్తు చేసుకున్నారు..? అ చిన్నారి సరిగ్గా తమ జార్జ్ ను పోలి వున్నాడా..? మరెందుకు అతడ్ని చూసి రాజ దంపతులు అంతగా మెచ్చుకున్నారు, అతడు చేసిన అల్లరి పనులే అందుకు కారణమా..? అయినా అతను అల్లరి పనులు చేస్తుంటే అ బుడతడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్లు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే.. డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే.

బ్రిటన్ దేశానికి చెందిన రాజదంపతులు మన దేశంలో పర్యటిస్తూ ఈశాన్య రాష్ట్రమైన అస్సోంకి వెళ్లారు, రాజదంపతులకు సాదర స్వాగతం పలికేందుకు అస్సోం ప్రభుత్వం అక్కడి సంప్రదాయకమైన నృత్యాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఒక దేశానికి రాజు, రాణి అనగానే మన మనసులో ఓభయం పొర్లుతుంది. లేదంటే ఏదో తెలియని ఆత్మన్యూనత వారికి దూరంగా ఉండేలా చేస్తుంది. కానీ అసోంలో మూడేళ్ల బాలుడికి మాత్రం వారిద్దరు అందరిలాంటి మాములు మనుషులుగానే కనిపించారేమో.. ఏకంగా వారి కాళ్లను తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. అది ఒక్కసారి కాదు.. తన ప్రదర్శన అయిపోయేవరకు.

రుచిమెచ్చిన బ్రిటన్ రాజకుటుంబం.. దోస మేకర్ ను అర్ఢర్ చేసింది.. 

బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్‌లు బుధవారం అస్సాంలోని ప్రముఖ కజిరంగా జాతీయ పార్కును సందర్శించిన విషయం తెలిసిదే. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉండటంతో గట్టి భద్రత నడుమ రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, చూశారు. అయితే, అంతకుముందు కేట్ దంపతులకు పార్క్లోకి స్వాగతం చెప్పేందుకు కొంతమంది సంప్రదాయ నృత్యం చేసేవారిని అక్కడికి పిలిపించారు. వీరిలో కాంఖాన్ బారువా మూడేళ్ల బుడతడు కూడా ఉన్నాడు. తన తల్లిదండ్రుల మాదిరిగానే ముచ్చటగొలిపే వేషధారణలో వచ్చి చక్కగా డప్పు దరువుకు నృత్యం చేశాడు.

చేస్తూ చేస్తూ ఏమాత్రం భయపడకుండా కేట్ దంపతుల కాళ్లను తొక్కాడు. అది కూడా కావాలని అల్లరిఅల్లరిగా పదేపదే తొక్కాడు. అయితే, వాళ్లిద్దరు రాజు, రాణి కావడంతో భయపడిన తల్లిదండ్రులు తమ బిడ్డ తరుపున క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ పిల్లాడి చిందులు చూసి ముచ్చటపడిన విలియం, కేట్ ఏం పర్వాలేదని, కాంఖాన్ తమ కుమారుడు జార్జ్ని గుర్తు చేశాడని, కాంఖాన్ కూడా తమకు జార్జ్ మాదిరిగానే అని చెప్పారు. అతడిని ఆ ఇద్దరు దంపతులు తీసుకొని ముద్దుచేశారు. అతడి డ్యాన్స్కు మురిసిపోయి తెగ చప్పట్లుకొట్టేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : william  kate middleton  Kangkan Baruah  prince george  Kaziranga National Park  

Other Articles